పద‌కొండు రోజుల దీక్ష ప్ర‌తిఫ‌లం సీఎం ర‌మేష్ కు పెద్ద పోస్టు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-02 15:36:45

పద‌కొండు రోజుల దీక్ష ప్ర‌తిఫ‌లం సీఎం ర‌మేష్ కు పెద్ద పోస్టు

ఎంత పెద్ద రాజ‌కీయ నాయకుడు అయినా దీక్ష విర‌మింప‌చేస్తే రాని క్రెడిట్ మ‌న ఎంపీ సీఎం ర‌మేష్ కు వచ్చింది అని తెలుగుదేశం నాయ‌కులు చెబుతున్నారు.. ముఖ్యంగా పొట్టి శ్రీరాముల‌తో ఆయ‌న‌ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్త‌డం ఇప్పుడు అంద‌రూ ఆశ్చ‌ర్యానికి  గుర‌య్యేలా ఉంది..
 
ప్ర‌జ‌లు కూడా ఇటు పొట్టి శ్రీరాముల‌తో పోల్చిన సీఎం ర‌మేష్ 11 రోజుల దీక్ష‌పై సంబ్ర‌మాశ్చ‌ర్యాల‌కు లోన‌వుతున్నారు. హ‌స్తిన‌లో జంత‌ర్ మంత‌ర్ కు ఎంత ఫేమ్ ఉందో ఇప్పుడు సీఎంర‌మేష్ చేసిన స‌భాస్ద‌లికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంత క్రేజ్ వ‌చ్చింది.. ఇక సంద‌ర్శ‌కులు కూడా వ‌చ్చి చూసే ప్లేస్ లా చేయ‌వ‌చ్చు తెలుగుదేశం నాయ‌కులు.. అలా కూడా అడుగులువేసే అవ‌కాశం ఉంది.
 
ఇక పార్టీ త‌ర‌పున సీనియ‌ర్లు జూనియ‌ర్లు అని ఏమీ లేదు ఇటు జేసి ఉక్కు దీక్ష అని అన్నా తుక్కు దీక్ష అని అన్నా మొత్తం తుప్పు వ‌ద‌ల‌గొట్టాడు రాయ‌ల‌సీమ నాయ‌కుల‌కు... ముఖ్యంగా కౌంట‌ర్లు వేసిన నాయ‌కుల‌కు సీఎం రమేష్ 11 రోజులు దీక్ష చేసి మొద‌టిరోజు ఎలా ఉన్నారో అలానే ఉన్నారు.. ఇక ప్రొద్దుటూరులో టీడీపీ నాయ‌కులు ఈ 11 రోజుల దీక్ష చేసిన పొట్టిశ్రీరాములు లాంటి గొప్ప వ్య‌క్తిత్వం క‌లిగిన సీఎం ర‌మేష్ ని ఏమైనా అంటే ప్ర‌జ‌లే ఊరుకునేలా లేరు.
 
ఇక క‌డ‌ప ఉక్కు కు ఆయ‌న ఎంతో క‌ష్ట‌ప‌డి ఇలా త‌న ప్రాణాన్ని సైతం ప‌ణంగా పెట్టి దీక్ష చేశారు.. ఒక‌రా ఇద్ద‌రా అన్నీ మీడియాలు త‌మ ప్రైమ్ టైమ్ ని సీఎం ర‌మేష్ దీక్ష‌కు కేటాయించాయి.. పీటీఐ, ఏఎన్నై, నేష‌న‌ల్ ఛానల్స్  గుర్తించలేదా అంటే వారు క‌వ‌ర్ చేశారు.. ఇక ఉక్కు మంత్రి ఈయ‌న ఉక్కుసంక‌ల్పం పై ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.. ఇటు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అయితే సీఎం ర‌మేష్ దీక్ష గురించి చ‌ర్చించ‌డానికి  కూడా తెలుగుదేశం ఎంపీల‌కు స‌మ‌యం ఇవ్వ‌లేదు.
 
దేశం అంతా  కనిపిస్తుంది క‌నుక ఆయ‌న కూడా స‌మ‌యం ఇచ్చి ఉండ‌రు.. అయితే ఇక్క‌డ ఏపీ ప్ర‌భుత్వం కేంద్రం ఉక్కుపై ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోతే ముందుకు వెళ్లే అవ‌కాశం ఉంద‌ట ..50 శాతం తాము భ‌రిస్తాం అన్నా మాకు అవ‌కాశం ఇవ్వ‌లేదు అని అన్న చంద్ర‌బాబు, ఏకంగా సీఎం ర‌మేష్ కు ఈ ఉక్కు ప‌రిశ్ర‌మ నిర్మాణం అయితే కీల‌క బాధ్య‌త‌లు ఇస్తార‌నే వార్త‌లు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి...ఇటు మైనింగ్ కింగ్ గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి మాత్రం త‌న‌కే ఈ ఫ్యాక్ట‌రీ నిర్మాణం ఇవ్వాలి, నా ఖ‌ర్చు ఇంత అయింది అని మ‌రో వైపు మ‌ద‌న‌ప‌డుతూ సీఎం చంద్ర‌బాబుని క‌లుస్తా అని కూడా అంటున్నారు.. ఈపెద్ద పోస్టు సీఎం ర‌మేష్ నిజంగా చేయ‌గ‌ల‌రు 11రోజులు దీక్ష చేసినా ఆయ‌నఉక్కు మ‌నిషిలా నిల‌బ‌డిన తీరు చూస్తే ఆయ‌న చేయ‌గ‌ల‌రు అని అంటున్నారు పార్టీ నేత‌లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.