టీడీపీ ఎమ్మెల్యేల‌కు బిగ్ షాక్‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp image
Updated:  2018-04-01 02:36:05

టీడీపీ ఎమ్మెల్యేల‌కు బిగ్ షాక్‌

ఏపీలో ప్ర‌త్యేక‌హోదా ఉద్య‌మం వ‌ల్ల‌  రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల్లో  కీల‌క మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏపీకి ప్ర‌త్య‌క‌హోదా ప్ర‌క‌టించాలంటూ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జ‌లు గ‌త‌ కోన్ని రోజులుగా కేంద్రం పై  పోరాటం చేస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. రాష్ట్రంలో ఉన్న అధికార తెలుగుదేశ ప్ర‌భుత్వం- కేంద్రంలో ఉన్న‌ ఎన్డీయే ప్ర‌భుత్వంలో గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా భాగ‌స్వామిగా ఉంటూ ప‌రిపాల‌న చేసిన విష‌యం అంద‌రికి తెలిసిందే. మిత్ర‌ప‌క్షంగా ప్ర‌భుత్వాన్ని పాలించిన స‌మ‌యంలో రాష్ట్రానికి ప్ర‌త్యేక‌హోదా , విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ను సాధించుకోవ‌డంలో టీడీపీ ఘోరంగా వైఫ‌ల్యం చెందిందిన విష‌యం అంద‌రికి తెలిసిందే.
 
ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌త్యేక‌హోదా కోసం నాలుగు ఏళ్లుగా నిర్విరామంగా పోరాటం చేస్తోంది. ఇటీవ‌ల ప్ర‌వేశ‌పెట్టిన చివ‌రి కేంద్ర బ‌డ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జ‌ర‌గ‌డంతో కేంద్రం పై అన్ని వ‌ర్గాల‌ ప్ర‌జ‌లు, రాజ‌కీయ పార్టీలు హోదా పోరాటాన్ని తీవ్ర‌త‌రం చేశాయి. దీంతో మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీ చేసేదేమి లేక కేంద్ర మంత్రి వ‌ర్గంలో ఉన్న ఎంపీల‌ను రాజీనామా చేయించింది టీడీపీ. దీంతో ఆగ‌కుండా  ఎన్డీయే ప్ర‌భుత్వంతో ఉన్న మిత్ర‌ప‌క్షాన్ని  కూడా టీడీపీ తెగ‌దెంపులు చేసుకుంది. టీడీపీ నాలుగేళ్ల కాలంలో చేసిన అవినీతి,అక్ర‌మాలు శృతిమించ‌డంతో రాష్ట్ర ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త‌ను మూట‌క‌ట్టుకుంది ప‌సుపు పార్టీ. 
 
దీన్ని గ‌మ‌నించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పార్టీ ఆవిర్బావ దినోత్స‌వంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో టీడీపీ నాయ‌కుల‌పై, పార్టీ పై ఘాటుగా అవినీతి ఆరోప‌ణ‌లు చేసి సంచ‌ల‌నం రేపారు. దీంతో తెలుగుదేశం పార్టీకి అండ‌గా ఉన్న జ‌న‌సేన కూడా దాదాపు నిష్క‌ర‌మించిన‌ట్లే అని చెప్ప‌వ‌చ్చు. వీట‌న్నింటిని వ‌దులుకున్న టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేవ‌లం అభివృద్ధి నినాదంతోనే ముందుకెళ్లాల్సిన ప‌రిస్థితి దాప‌రించింది. 40 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న‌ సీఎం చంద్ర బాబు ప్ర‌స్తుతం సందిగ్దంలో ప‌డ్డార‌ని విశ్లేష‌కులు అంటున్నారు.  
 
అన్ని స‌మ‌స్య‌ల ను ఎదుర్కొంటూనే 2019 ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ధం కావాల్సిన త‌రుణంలో క‌ఠిన నిర్ణ‌యాల‌కు వెనుకాడేది లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పై తీవ్ర వ్య‌తిరేకత పెరుగుతోంద‌ని గ్ర‌హించిన సీఎం చంద్ర‌బాబు ఇప్పుడు సుమారు 30 మంది ఎమ్మెల్యేల‌పై వేటు వేసేందుకు సిద్ధ‌మ‌య్యార‌ట‌. 
 
వైసీపీ త‌రుప‌న గెలుపోంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో స‌గం మందికి పైగా సీట్లు ద‌క్క‌డం క‌ష్ట‌మ‌ని తేలింద‌ట‌. వీరితో పాటు టీడీపీ త‌ర‌పున గెలిచిన ఎమ్మెల్యేల్లోనూ క‌నీసం 30మందికి అవ‌కాశం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే అలాంటి వారి లిస్టును చంద్ర‌బాబు సిద్దం చేశార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల‌ స‌మాచారం.
 
సిట్టింగ్ ఎమ్మెల్యేల పై తీవ్ర వ్య‌తిరేక‌త ఉన్న‌ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌త్యామ్నాయ నాయ‌క‌త్వాన్ని ఎంచుకోవ‌డం శ్రేయ‌స్క‌ర‌మ‌ని చంద్ర‌బాబు భావిస్తున్నార‌ట‌. ఈ జాబితాలో గోదావ‌రి జిల్లాలకు చెందిన ప‌లువురి పేర్లు వినిపిస్తున్నాయి. విశాఖ జిల్లాలో కూడా క‌నీసం ముగ్గురికి అవ‌కాశం ఉండ‌ద‌ని చెబుతున్నారు. కొన్నిచోట్ల వార‌సుల‌కు, వారి కుటుంబాల‌కు చెందిన వారికి ప్రాధాన్యం ఇచ్చిన ప్ప‌టికీ మ‌రికొన్ని స్థానాల్లో మాత్రం పూర్తిగా కొత్త వారితో రంగంలో దిగే ఆలోచ‌న‌లో టీడీపీ అధినేత ఉన్న‌ట్టు తెలుస్తోంది. అదే జ‌రిగితే క‌నీసంగా 30మంది సిట్టింగులు అంటే నాలుగోవంతు నేత‌ల‌కు మొండిచేయి త‌ప్ప‌దని పార్టీ నేత‌లు స్ప‌ష్టం చేస్తున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.