ఏపీ బీజేపీకి ఇంచార్జ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-30 11:05:16

ఏపీ బీజేపీకి ఇంచార్జ్

కార్య‌వ‌ర్గం పార్టీ నిర్మాణం అంటే ఎంతో పెద్ద ప‌ని.. అయితే కొత్త పార్టీల‌కు ఇది పెద్ద ప్రాసెస్, కాని ఎప్ప‌టి నుంచో దేశంలో నిల‌దొక్కుకున్న జాతీయ పార్టీలు కేవ‌లం ఈ ప‌ద‌వులు భ‌ర్తీ చేస్తే చాలు, దేశంలో న‌లుదిక్కులా పార్టీని విస్త‌రింప‌చేయ‌డానికి పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను కేడ‌ర్ ను స‌మాయ‌త్తం చేయ‌డానికి పార్టీలు ఎంతో క‌ష్ట‌ప‌డి కృషిచేస్తాయి. ఎన్నిక‌ల త‌ర్వాత ఫ‌లితం వ‌చ్చినా రాకపోయినా పార్టీకి సేవాద‌రులు ఉంటూనే ఉంటారు. వారి క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌హిస్తూనే ఉంటారు.

త్వ‌ర‌లో కేంద్రంలో ఉన్న బీజేపీ ఏపీతో స‌హా నాలుగు రాష్ట్రాల‌కు పార్టీ ఇంచార్జ్ ల‌ను నియ‌మించ‌నుంది అని తెలుస్తోంది....ఫిబ్రవరిలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందు క‌మ‌లం పార్టీ ర‌థ‌సార‌ధి అమిత్‌షా పార్టీని పునర్‌వ్యవస్థీకరించేటప్పుడే ఆంధ్రప్రదేశ్‌, అసోం, ఝార్ఖండ్‌, గోవా రాష్ట్రాలకు ఇన్‌ఛార్జిలను నియమిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌కు పార్టీ ఇన్‌ఛార్జిగా ఉన్న సిద్ధార్థ నాథ్‌ సింగ్‌ యూపీలో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంలో గత ఏడాది మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.. అప్ప‌టి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలతో మెరుగైన సమన్వయం నెరపాలని పార్టీ ఇన్‌ఛార్జిలకు అమిత్‌షా సూచించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏపీలో తెలుగుదేశంలో మైత్రి బంధం కొన‌సాగిస్తున్న బీజేపీ, త్వ‌ర‌లో పార్టీలో సీనియర్ నాయ‌కుల‌తో స‌మావేశం కూడా ఏర్పాటు చేయ‌నుంది అని తెలుస్తోంది.

భాగస్వామ్య పక్షాలతో విభేదాలున్న పక్షంలో రాష్ట్రస్థాయిలోనే వాటిని పరిష్కరించే బాధ్యతలను కూడా ఇంచార్జ్ ల‌కు అప్పగిస్తారని పార్టీ వ‌ర్గాలు వెల్లడించాయి. చాలా మంది పార్టీ ఆఫీస్‌ బేరర్లు వివిధ ప్రభుత్వ పదవులు చేపట్టారు. దీంతో భాజపాలో దాదాపు 40 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందుగానే ఈ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తానికి పార్టీకి ఇది ఎంతో మేలు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి హ‌స్తిన నుంచి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.