చంద్ర‌బాబు వీడియో క్లిప్పులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-29 18:55:59

చంద్ర‌బాబు వీడియో క్లిప్పులు

ఏపీలో ప్ర‌త్యేక‌హోదా  అంశమే ధ్యేయంగా అన్ని రాజ‌కీయ పార్టీలు పోరాటం చేస్తున్న  విష‌యం తెలిసిందే. ప్ర‌త్యేక‌హోదా ప్ర‌క‌టించాల్సిన కేంద్ర ప్ర‌భుత్వం దాన్ని విస్మ‌రించింది. దీని పై గ‌త కొన్ని రోజులుగా పార్ల‌మెంట్‌లో సైతం ఏపీ ఎంపీలు పోరాడుతున్నారు. ఈ క్ర‌మంలో బీజేపీకి  చెందిన‌ ఎమ్మెల్సీ మాధవ్  ప్రత్యేక హోదా అంశం దేశంలో ముగిసిన అధ్యాయమని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలతో  పోల్చుకుని ఆంధ్రప్రదేశ్‌కు హోదా ప్ర‌క‌టించాలంటూ పోరాటం చేయ‌డం విడ్డూరంగా ఉంద‌ని అన్నారు.
 
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తెలుగుదేశం ప్రధానమంత్రి క్లిప్పింగ్స్‌ను ప్రతిపక్షం-  బీజేపీ లేకుండా చూపించడం పై  పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ తీవ్రంగా మండిప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయ‌న రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు పూర్తిగా స్వ‌స్తిప‌లికి స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం అసెంబ్లీని ఉప‌యోగించుకుంటున్నార‌ని అని అధికార పార్టీ పై ఆరోపించారు. ప్ర‌త్యేక‌హోదా పై ప్రధాని మాట మార్చిన వీడియో క్లిప్పింగ్స్‌ను టీడీపీ అసెంబ్లీలో  ప్రదర్శిండాన్ని మాధ‌వ్ తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు.
 
ప్ర‌త్యేక‌హోదా అంశం పై సీఎం చంద్ర‌బాబు మాట మార్చిన వీడియో క్లిప్పింగ్స్‌ను అసెంబ్లీలో  ప్రదర్శిండానికి బీజేపీకి అనుమతిస్తారా అంటూ ప్ర‌శ్నించారు.గతంలో చంద్రబాబు రుణమాఫీ, పార్టీ ఫిరాయింపులపై మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్‌ను మీడియాకు చూపించారు ఎమ్మెల్సీ మాధవ్.  ప్ర‌త్యేకాహోదా క‌న్నా ప్యాకేజినే బెటర్‌ అన్న చంద్ర‌బాబు ఇప్పుడు బీజేపీని ప్ర‌జ‌ల్లో దోషిని చేసే ప్ర‌య‌త్నం దుర్మార్గమని అన్నారు. బీజేపీ వల్ల 15 సీట్లు కోల్పోయామని అంటున్న చంద్రబాబుకు పొత్తు లేకుండా గెలిచిన చరిత్ర ఉందా అని ఆయ‌న‌ ప్రశ్నించారు.
 
అమ‌రావ‌తి రాజ‌ధానిలో ఎమ్మెల్యేలు, అధికారుల నివాస భవన నిర్మాణాలు చేపట్టకుండానే నిర్మించినట్లు రూ.774 కోట్లకు ఏపీ ప్రభుత్వం యూసీజీ పంపించిదని తెలిపారు. ఈ భ‌వ‌నాల కోసం బీజేపీ నేతలందరూ అమరావతి రాజధాని ప్రాంతం అంతా అన్వేషించినా ఎక్క‌డా క‌న‌ప‌డ‌లేద‌ని అన్నారు..  కట్టిన బిల్టింగ్‌లు భూ గర్భంలో దాక్కున్నాయా అంటూ వ్యంగ్యంగా విమ‌ర్శించారు. యూసీజీలు పంపించిన భ‌వ‌నాలు ఎక్క‌డున్నాయో  చంద్రబాబు చూపించాల‌ని చెప్పాలని డిమాండ్   చేశారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.