టీడీపీకి బీజేపీ గుడ్ బై

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-24 10:30:42

టీడీపీకి బీజేపీ గుడ్ బై

సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ  రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి...ఒక వైపు కేంద్రంలో మ‌రోసారి బీజేపీని  అధికారంలోకి తీసుకురావ‌డానికి ప్ర‌ధాని మోదీ, అధ్య‌క్షుడు అమిత్‌షా వ్యూహాలు ర‌చిస్తున్నారు... మ‌రో వైపు ఏపీలో ఇప్ప‌టికే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించడానికి సిఎం చంద్ర‌బాబు కొత్త ఎత్తుగ‌డులు వేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ భాగ‌స్వామిగా ఉండి విజ‌యం సాధించింది తెలుగుదేశం . అయితే ప్ర‌స్తుతం టీడీపీ-బీజేపీ నాయ‌కులు ఒక‌రి పై ఒక‌రు విమ‌ర్శలు చేసుకుంటున్నారు.
 
ఇటీవ‌ల కేంద్ర బ‌డ్జెట్‌లో ఏపీకి అన్యాయం జ‌రిగింద‌ని టీడీపీ నాయ‌కులు బీజేపీని సెంట‌ర్ చేస్తున్నారు, ఏ రాష్ట్రానికి కేటాయించ‌ని నిధులు ఏపికి మంజూరు చేశామ‌ని, బీజేపీ నాయ‌కులు మీడియా ముందుకు వ‌చ్చి రాజ‌కీయ ల‌బ్ది కోసం బ‌హిరంగంగా త‌మ గ‌ళాన్ని వినిపిస్తున్నారు. ఇదే తీరుతో ఎన్నిక‌ల‌కు వెళితే ఓట‌మి చెందుతామ‌ని ఇరు పార్టీలు ఆలోచ‌న చేసి, పోత్తును విర‌మించుకోవాల‌ని అనుకుంటున్నాయ‌ట‌.
 
అధికార‌మే అంతిమ ల‌క్ష్యంగా పెట్టుకున్న  టీడీపీకి కేంద్రం స‌హాయం చేయ‌క‌పోగా,సీఎం చంద్ర‌బాబుకు క‌నీసం ప్ర‌ధాని మోదీతో క‌ల‌వ‌డానికి అనుమ‌తి సైతం మంజూరు చేయ‌లేదు, పీఎంవో కార్యాల‌యం. రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న‌ వైసీపీకి ప్ర‌ధానిని క‌ల‌వ‌డానికి అనుమ‌తి ఇచ్చింది పీఎంవో కార్యాల‌యం. వైయ‌స్ జ‌గ‌న్‌తో మొదలుకుని రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డికి సైతం  అనుమ‌తివ్వ‌డాన్ని సీఎం చంద్ర‌బాబు సీరియ‌స్‌గా తీసుకున్నారు. 
 
రాష్ట్ర ఎంపీలను క‌ల‌వ‌డానికి స‌మ‌య‌మిస్తున్న ప్ర‌ధానిమోదీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకి ఇవ్వ‌క‌పోవ‌డాన్ని తెగదెంపులకు కారణమని తెలుస్తోంది. టీడీపీతో బీజేపీ విడిపోవ‌డానికే సిద్ధమైందన్న కార‌ణంతోనే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ సమస్యల ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్న‌ది అని అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.