బీజేపీ అదే చేయ‌నుందా ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-12 16:36:00

బీజేపీ అదే చేయ‌నుందా ?

తెలుగుదేశం పార్టీకి బీజేపీతో క‌టీఫ్ చెప్పిన త‌ర్వాత కాస్త ప‌రిస్దితి గంద‌ర‌గోళంగానే మారింది... అవినీతి మార్క్ లేని మోదీ, మొత్తం అవినీతితో నిండిపోయిన తెలుగుదేశంతో  బ‌య‌ట‌ప‌డ‌టంతో ఇప్పుడు తెలుగుదేశం ప‌రిస్దితి ఎటూ పాలు పోకుండా ఉంది.. బీజేపీ మార్క్ రాజ‌కీయాల‌ను సైతం త‌ల‌ద‌న్నేలా చంద్ర‌బాబు రాజ‌కీయం చేస్తున్నారు అని ఆస్ధాన‌మీడియాలు చెప్ప‌డం, రాష్ట్రంలో తెలుగు త‌మ్ముళ్లు తందాన తాన అని డ‌ప్పు కొట్ట‌డంతో, రాజ‌కీయం కాస్త వేడెక్కింది.
 
అస‌లు మోదీ ఎక్క‌డ..?  నేను ఎక్క‌డ ? 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం నాది... ఏపీలో ప్ర‌తీ మొక్క నేను వేసిందే, ప్ర‌తీ బిల్డింగు నా స‌ర్కారు క‌ట్టిందే, ఏపీపై ఎంతో ఇష్టంలో జ‌న్మ‌భూమి పెట్టి ఉమ్మ‌డి ఆంధ్రాను స‌స్య‌శ్యామ‌లం చేశాను అంటారు బాబు. రాజ‌కీయంగా చంద్ర‌బాబు ఎటువంటి డెసిష‌న్ తీసుకున్నా దానిని వ్య‌తిరేకించే నాయ‌కులు ఉండరు.. బ‌హుశా నాయ‌కుడు అంటే చంద్ర‌బాబు అనేలా ఆస్ధాన మీడియాలు కూడా డ‌ప్పు కొడుతుంటాయి.
 
అయితే బీజేపీ మార్క్ రాజ‌కీయాలు తెలుగుదేశం ఆలోచిస్తోంది.. బీజేపీ అంటే మ‌త‌త‌త్వ పార్టీ అన్న చంద్ర‌బాబు అదే పార్టీ గొడుగు కింద‌కు 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో చేరి ఆ నీడ‌లో పార్టీ గెలిపించుకుని అంద‌లం ఎక్కారు... ఇక  పైన గొడుక్కి క‌న్నం పెడ‌దామ‌నుకున్నార‌ట, ఇప్పుడు  ఇదే ఏపీ బీజేపీ వాద‌న.... అయితే ఏపీ బీజేపీ ప్ర‌మాణ స్వీకారం అయిన నెల రోజుల నుంచే కేంద్రానికి పుస్త‌కాల మీద పుస్త‌కాలు లేఖ‌లు రాసి పంపారు... బాబు అవినీతి జ‌మానా ఖ‌జానా అన్ని కేంద్రానికి  చేరాయి... 
 
సంవ‌త్స‌రం గ‌డిచాక ఈ త‌తంగం చూద్దాం అనుకుని నాలుగేళ్లు ఓపిక ప‌ట్టారు మోదీ... చివ‌ర‌కు ప్ర‌త్యేక హూదా ప్ర‌త్యేక ప్యాకేజీ సంజీవ‌ని ఇలా ప‌ది ర‌కాల షేడ్స్ బాబు చూపించే స‌రికి, అమిత్ షాకి ,రాజ్ నాథ్ కు, అరుణ్ జైట్లీకి ,ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి నీర‌సం వ‌చ్చింది... చేసేది లేదు పో అన్నారు బాబు వెంట‌నే బ‌య‌ట‌కు వ‌చ్చాడు..
 
అయితే ఎంత చేసినా బీజేపీకి క్రెడిట్ ఏపీలో రావ‌డం లేదు... అంతా బాబు ఖ‌జానాలోకే వెళుతోంది... పైగా మోదీని గ‌ట్టిగా ప్ర‌శ్నించి తీసుకువ‌చ్చా అని చెప్ప‌డం?  ఇవ‌న్ని ఏపీ బీజేపీకి అస్స‌లు న‌చ్చ‌లేదు... కేంద్రానికి రాష్ట్ర క‌మ‌లం నాయ‌కులు క‌బుర్లు పంపారు... ఇక్క‌డ పేప‌ర్ల ల‌క్ష‌ల కోట్ల హ‌డ్డింగులు చూపించారు.... చివ‌ర‌కు బాబును ప‌క్క‌న పెట్టారు, అంతే సింపుల్.. ప్ర‌త్యేక హూదా వ‌స్తుంది అని బీజేపీ చెప్ప‌డం చూస్తుంటే?  బాబును ప‌క్క‌న పెట్టి ప్ర‌త్యేక హూదా బీజేపీ ఇచ్చే ఆలోచ‌న చేస్తోంది అనేది గ‌మ‌నించాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.