బ్రేకింగ్.. మాతో క‌లిస్తే జ‌గ‌నే సీఎం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-14 18:28:49

బ్రేకింగ్.. మాతో క‌లిస్తే జ‌గ‌నే సీఎం

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంక‌త్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఒకప‌క్క‌ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ మ‌రో వైపు విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదా, క‌డ‌ప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వేజోన్ సాధ‌న‌కోసం కేంద్ర రాష్ట్ర‌ ప్ర‌భుత్వాన్ని త‌న‌ధైన శైలిలో నిల‌దీస్తున్నారు జ‌గ‌న్. 
 
ఇక ఆయ‌న చేస్తున్న విమ‌ర్శ‌ల్లో ఏ మాత్రం నిజం లేద‌ని నాలుగు సంవ‌త్సరాలు బీజేపీతో కాపురం చేసిన తెలుగుదేశం పార్టీ నాయ‌కులు మండిప‌తున్నారు. పైగా తాము ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని, అందుకే రాష్ట్ర ప్ర‌జ‌లు టీడీపీని అధికారంలోకి తీసుకువ‌చ్చార‌ని అంటున్నారు. అంతేకాదు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో టీడీపీ రక‌ర‌కాల‌ రంగు పూసుకుని వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బీజేపీతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తు నిర్వ‌హించేందుకు ర‌హ‌స్యంగా కేంద్ర‌మంత్రుల‌తో స‌మావేశం అవుతున్నార‌ని టీడీపీ నాయ‌కులు త‌మ అనుకూల మీడియాలో ప్ర‌చారం చేస్తున్నారు.
 
ఇక వారు చేస్తున్న విమ‌ర్శ‌లకు వైసీపీ నాయ‌కులు కౌంట‌ర్ ఇస్తున్నారు. రాష్ట్రానికి ఏ పార్టీ అయితే విభ‌జ‌న చ‌ట్టంలో పొందుపరిచిన అన్ని హామీల‌ను ఏపీకి ప్ర‌క‌టిస్తామ‌ని తొలి సంత‌కం చేస్తుందో తాము ఆ పార్టీకే మద్ద‌తు ఇస్తామ‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ అనేక సార్లు స్ప‌ష్టం చేస్తూనే ఉన్నారు.
 
ఇక ఆయ‌న నిజాయితీ రాజ‌కీయాల‌ను చూసి రాష్ట్ర రాజ‌కీయ నాయ‌కులే కాకుండా దేశ రాజ‌కీయ నాయ‌కులు కూడా ఆశ్య‌ర్య‌పోతున్నారు. రానున్న రోజుల్లో తండ్రిని మించిన త‌న‌యుడు అవుతార‌ని దేశ‌నాయ‌కులు భావిస్తున్నారు. అయితే ఇదే క్ర‌మంలో బీజేపీ కేంద్ర‌మంత్రి రాందాస్ అథవాలే హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వైఎస్ జ‌గ‌న్ ఎన్డీఏకు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆయ‌న సూచించారు.
 
జ‌గ‌న్ త‌మ‌కు మ‌ద్ద‌తు తెలిపితే ఆయన‌ ముఖ్య‌మంత్రి అవుతార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కు పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ మ‌రోసారి విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశాల‌ను ఏ పార్టీ నాయ‌కులు అయితే ప్ర‌క‌టిస్తారో వారికే తాము మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఒక విధంగా చూసిన‌ట్లు అయితే జ‌గ‌న్ ఇదే విష‌యాన్ని చెప్పి...చెప్పి.. ఒక చిన్న‌పాటి ప‌ల్ల‌విలా మారింద‌నే చెప్పాలి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.