అయ్య‌న్న టీడీపీకి గుడ్ బై చెప్ప‌లేదు.. కేఈ కృష్ణ‌మూర్తి ఇంకా ఉరి వేసుకోలేదు ఎందుకో..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ayyanna pathrudu and ke krishna murthi
Updated:  2018-11-03 12:10:48

అయ్య‌న్న టీడీపీకి గుడ్ బై చెప్ప‌లేదు.. కేఈ కృష్ణ‌మూర్తి ఇంకా ఉరి వేసుకోలేదు ఎందుకో..

ఆంధ్రప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి కొద్దిరోజుల క్రితం మీడియా స‌మ‌క్షంలో ప‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ-కాంగ్రెస్ పార్టీ వ‌చ్చే ఎన్నికల్లో క‌లిసి పోటీ చేస్తే తాను ఉరి వేసుకుని చ‌నిపోతాన‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. అలాగే మ‌రో మంత్రి అయ్య‌న్న పాత్రుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశంపార్టీ అని అలాంటి పార్టీతో ఎట్టిప‌రిస్థితిలో పొత్తుకుద‌ర‌ద‌ని అన్నారు. ఒక వేళ‌ పొత్తు పెట్టుకుంటే టీడీపీ నుంచి తాను వైదొలుగుతాన‌ని అన్నారు
 
అయితే తాజాగా వీరు చేసిన వ్యాఖ్య‌లపై భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గుర్తు చేశారు. ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు హ‌స్తిన సాక్షిగా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి మ‌ర్యాద పూర్వ‌కంగా శాలువా క‌ప్పి తాము రానున్న రోజుల్లో క‌లిసి ప‌ని చేస్తామ‌ని చెప్పార‌ని అయితే కేఈ కృష్ణ మూర్తి ఇంకా బ్ర‌తికే ఉన్నార‌ని వీర్రాజు ఎద్దేవా చేశారు. అలాగే ఎట్టిప‌రిస్థితిలో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు కుద‌ర‌ద‌న్న అయ్య‌న్న‌ పాత్రుడు ఇంకా టీడీపీలో ఉన్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. 
 
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అవ‌కాశావాద‌ని ఆయ‌నకు అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు ఎవ‌రితో అయినా పొత్తు పెట్ట‌కుంటార‌ని వీర్రాజు ఎద్దేవా చేశారు. అంతేకాదు చంద్ర‌బాబు ఒక రాజ‌కీయ వ్య‌భిచార‌ని తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు ఆయ‌న. ముఖ్య‌మంత్రి పొత్తుల విష‌యంలో వ‌ర్ణించేందుకు నాగ‌రిక భాష గ్రంథాలు కూడా స‌రిపోవ‌ని వీర్రాజు అన్నారు. అలాగే వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజీపీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంద‌ని మీడియా అడ‌గ‌గా అందుకు ఆయ‌న బ‌దులిస్తూ రాష్ట్రంలో నాలుగు సీట్లు కూడా లేని త‌మ‌ను అడ‌గ‌డం కంటే ఇదే ప్ర‌శ్న చంద్ర‌బాబు నాయుడుని అడ‌గండ‌ని అన్నారు. 

షేర్ :

Comments

0 Comment