లోకేష్ స్పీడుకు బ్రేకులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-30 14:56:44

లోకేష్ స్పీడుకు బ్రేకులు

ఉద‌యం సుప్ర‌భాత సేవ‌లా లేవ‌గానే తెలుగుదేశం నాయ‌కులు వైసీపీ నాయ‌కుల పై విమ‌ర్శ‌లు చేయ‌డం ష‌రామాములే.. పార్టీ త‌ర‌పున నాయ‌కుల మాట‌లు వింటూనే ఉంటాము...అచ్చ‌మైన తెలుగులో మాట్లాడే నాయ‌కులు కొంద‌రు అయితే అది ఏబాషో కూడా అర్దంకాకుండా తిట్టేమాట‌ల నాయ‌కులు కొంద‌రు ఉన్నారు.. వారు మీడియా ముందుకు వ‌స్తే రిమోక్ట్ ఎక్క‌డ ఉందా అని చూసుకునే వారు ఉన్నారు అంటే ఆశ్చ‌ర్యపోతారు.
 
ఇక ఎన్నిక‌ల‌కు ప‌ది నెల‌లు మాత్ర‌మే స‌మ‌యం ఉంది.. ఇక తెలుగుదేశం దీంతో తమ  స్పీడును పెంచింది.. జ‌గ‌న్ ని మాత్ర‌మే సెంట‌ర్ చేస్తే పాద‌యాత్ర‌లో ఉన్నారు కాబ‌ట్టి మీడియా రింగ్ చేస్తుంది అని ఇటు తెలుగుదేశం ప్లాన్ ..ఇక పార్టీ త‌ర‌పున జ‌గ‌న్ పై జిల్లాకు వ‌చ్చి ఓ ముగ్గురు  మంచి వాగ్దాటి క‌లిగిన నాయ‌కుల ద్వారా స‌మ‌యం కుదిరిన‌ప్పుడ‌ల్లా తిట్టించ‌డం ష‌రామాములు అయిపోయింది పార్టీకి..
 
కోర్టులు జ‌డ్జీలు న్యాయ‌స్దానాలు చెప్ప‌లేదు కాని, జ‌గ‌న్ 42 వేల కోట్లు తినేశాడు - దాచేశాడు అని విమ‌ర్శిస్తున్నారు సైకిల్ పార్టీ నేత‌లు.. పోని ఎక్క‌డైనా ఉంటే తీసుకోండి ప‌ది పైస‌లు భాగం ఇస్తే సంత‌కం పెడ‌తా అని జ‌గ‌న్ స‌వాల్ చేస్తే, వెంట‌నే అక్క‌డ నుంచి ప‌రార‌య్యారు నాయ‌కులు. ఇక మంత్రి లోకేష్ వైసీపీని ఇరుకున పెట్టే ప‌నిలో ఉంటున్నారు అని వైసీపీ అభిప్రాయ ప‌డుతోంది..
 
ఇటు వైసీపీకి ఒక్క‌రిని తిడితే తెలుగుదేశ‌నికి ఆవ‌గింజ అంత ఉప‌యోగం కూడా లేదు.. పైగా జ‌గ‌న్ కు మ‌రింత ప్ర‌జాద‌ర‌ణ వ‌స్తోంది.. అందుకే పార్టీ త‌ర‌పున బీజేపీకి జ‌గ‌న్ కు చీక‌టి ఒప్పందం ఉంది అని టార్గ‌ట్  చేయ‌డం మొద‌లు పెట్టారు.. అందుకే మోదిని జ‌గ‌న్ ఏమాట అనరు అని కొత్త రాగం తీస్తున్నారు.. ఇక్క‌డ గ‌మనించాల్సింది ఒక‌టి ఉంది అని వైసీపీ చెబుతోంది.
 
జ‌గ‌న్ కేంద్రం ఏపీకి మోసం చేసింది ఇక్క‌డ చంద్ర‌బాబు స‌ర్కారు నాలుగేళ్లు బీజేపీతో ఎలా క‌లిసి ప‌నిచేశారు అని, అప్పుడు హామీల గురించి అడ‌గ‌లేదా అని కొన్ని వంద‌ల సార్లు అన్నారు... ఈ విష‌యం  వైసీపీ గుర్తుచేస్తోంది. ఇక లోకేష్, మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డికి,  దేవినేని ఉమా కౌంట‌ర్ల‌కు వైసీపీ కూడా రీ కౌంట‌ర్ల‌కు రెడీ అవుతోంది.. ఆ స్పీడుకు బ్రేకులు వేసేందుకు వైసీపీ రెడీ అవుతోంద‌ట‌.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.