టీడీపీపై కేంద్రం ఫోకస్...రంగంలోకి సిబిఐ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-29 11:05:11

టీడీపీపై కేంద్రం ఫోకస్...రంగంలోకి సిబిఐ

బీజేపీ టీడీపీపై ఫోకస్ చేసిందా? టీడీపీ బీజేపీకి కటీఫ్ చెప్పడంతో ఏపీ రాజకీయాలపై బీజేపీ ద్రుష్టి సారించిందా? బాబు చేసిన వ్యాఖ్యలతో బీజేపీ ఏపీలో జరిగిన అవినీతిని వెలికి తీసే పనిలో పడిందా? కేంద్రం ఆదేశాల మేరకే సీబీఐ ఏపీపై కన్నేసిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
 
2014 - 2015 సంవత్సరంలో మంత్రి పత్తిపాటి పుల్లరావు వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలో సుమారు 500 కోట్ల మేర పత్తి కుంభకోణం వెలుగుచూసింది...ఈ కుంభకోణంలో పాలుపంచుకున్న సుమారు 26 అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం... కానీ మంత్రి పత్తిపాటి పుల్లారావును మాత్రం చూసి చూడనట్టు వదిలేసింది...తర్వాత కొద్ది రోజులకు అధికారులపై ఉన్న సస్పెన్షన్ కూడా ఎత్తి వేసింది...సస్పెన్షన్ ఎత్తివేయడంతో దీని వెనుక ఎవరిదో పెద్ద హస్తం ఉందని భావించిన కేంద్రం, ఈ కుంబకోణంపైనా విచారం చేయడానికి సీబీఐని రంగంలోకి దించినట్టు సమాచారం.
 
ఈ కుంభకోణంతో సీసీఐ సంస్థ సుమారు 600 కోట్ల వరకు నష్టపోయింది...ప్రభుత్వ పెద్దలు కొందరు  రైతుల దగ్గర నుండి అతి తక్కువ ధరలో నాణ్యమైన పత్తిని కొనుగోలు చేసి, నాసిరకమైన పత్తిని కలిపి రైతుల పేరుతో సీసీఐ సంస్థకి కట్టబెట్టడంతో ఈ నష్టం వాటిల్లింది...ఈ కుంబకోణంలో వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు సంబంధం ఉంది అని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి...కానీ రాష్ట్రా ప్రభుత్వం మాత్రం ఆయన్ని తప్పించి, అధికారులపై వేటు వేసింది.
 
బీజేపీ - టీడీపీల మధ్య ఉన్న సంబంధాలు తెగిపోవడం, టీడీపీ బీజేపీపైన ఘాటైన విమర్శలు చేస్తుండడంతో, పత్తి కుంభకోణానికి సంబంధించిన అవినీతిని వెలుగుతీసేందుకు కేంద్రం సిబిఐని రంగంలోకి దించిందని అంటున్నారు మేధావులు...ఈ మేరకే సిబిఐ ప్రత్యేక బృందం దర్యాప్తు కూడా ప్రారంభించిందని సమాచారం...సిబిఐ రంగంలోకి దిగటంతో ఈ కుంభకోణానికి సంబందించిన ఒక్కొక విషయాలు బయటకి వస్తున్నాయి.. ప్రభుత్వ పెద్దలు 800 మంది రైతుల పేరుతో సుమారు కోటికి పైగా అమ్మకాలు చేసారని సమాచారం...ఇప్పుడు సిబిఐ బృందం రైతులపైనా ద్రుష్టి సారించింది...దీని వెనుక ఎవరు ఉన్నారు అని కూపీ లాగుతుంది.
 
ఈ కుంభకోణంలో పత్తిపాటి పుల్లారావు పేరు ప్రముఖంగా వినిపించడంతో, సిబిఐ నిజానిజాలు నిగ్గు తెలిస్తే పత్తిపాటికి ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు...పత్తిపాటి మాత్రమే కాకుండు మరో ముగ్గురు మంత్రుల బాగోతం కూడా కేంద్రం దగ్గర ఉందని సమాచారం...వీరు చేసిన అవినీతిపైనా కూడా సిబిఐ రంగంలోకి దిగే అవకాశం ఉందని అంటున్నారు మేధావులు.
 
ఇదే జరిగితే మరో సంవత్సరం మాత్రమే ఎన్నికలకు సమయం ఉండడటంతో టీడీపీకి బారి నష్టం వాటిల్లుతుంది...ఇప్పుడు టీడీపీ ప్రత్యక హోదా విషయంలో యూ-టర్న్ తీసుకోవడం, ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు వినిపించడం, ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చకపోవడంతో ప్రజల్లో టీడీపీపైన వ్యతిరేకత భారీస్థాయిలో ఉంది...దానికి తోడు ఈ విచారణలు జరిగితే మాత్రం టీడీపీకి ఎవరు పూడ్చలేని డ్యామేజ్ జరిగినట్టే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.