షాకిచ్చిన బీజేపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-14 15:36:25

షాకిచ్చిన బీజేపీ

కొంత కాలంగా బీజేపీ నుండి రాష్ట్ర రాజకీయాలలో దూకుడుగా వ్యవరిస్తున్నారు సోము వీర్రాజు...ఎవరైనా బీజేపీని పల్లెత్తి మాట మాట్లాడిన, వెంటనే వాళ్లకు కౌంటర్ ఇస్తూ యాక్టీవ్ గా ఉంటున్నారు సోము వీర్రాజు...ఈ మధ్య కాలంలో బీజేపీలో కీలక నేతగా మారారు...అందుకే ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిని ఆశించారు...దీనికి బీజేపీ కూడా సుముఖంగానే వుంది అనే సంకేతాలు వినిపించాయి కొద్ది కాలంగా...
 
అయితే ఇప్పుడు సోము వీర్రాజుకి షాకిచ్చింది బీజేపీ అధిష్టానం, బీజేపీ నుండి పార్టీ మారాడనికి సిద్ధంగా ఉన్న కన్నా లక్ష్మి నారాయణను బుజ్జగించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కన్నా లక్ష్మి నారాయణకు కట్టబెట్టింది బీజేపీ అధిష్టానం...ఇలా చేస్తే కన్నా లక్ష్మినారాయణను దగ్గర చేసుకొని, కాపులను దగ్గర చేసుకోవచ్చని ఈ పదవిని ఇచ్చారని సమాచారం...
 
సోము వీర్రాజుకి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వినర్ గా ఇచ్చింది...రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న సోము వీర్రాజుకి ఎదురుదెబ్బ తగిలింది...దీంతో సోము వీర్రాజు అలకబూనినట్టు సమాచారం...కన్నా లక్ష్మీనారాయణతో కలిసి సోము వీర్రాజు ఢిల్లీకి వెళ్తారని భావించిన, ఆయన వెళ్లకుండా అజ్ఞాతంలోకి వెళ్లారని సమాచారం...సోము వీర్రాజుకి అనుచరులు కన్నాకి రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిని అప్పగించడాన్ని తప్పుబట్టారు, మా నేత పార్టీ కోసం ఎంతో కష్టపడితే, పదవిని వేరే వాళ్ళకి ఇస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు సోము వీర్రాజు అనుచరులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.