బాబుకు చుక్కలే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu and modi
Updated:  2018-05-15 03:23:00

బాబుకు చుక్కలే

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు గ‌త నాలుగు సంవ‌త్స‌రాల పాటు బీజేపీతో మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌ర్వాత ఏపీలో  అక‌స్మాత్తుగా ప్ర‌త్యేక హోదా తెర‌పైకి రావ‌డంతో  చంద్ర‌బాబు బీజేపీ మిత్ర‌ప‌క్షానికి క‌టిఫ్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు రానే వ‌చ్చాయి.
 
ఇక ఈ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు త‌న న‌ల‌బై సంవ‌త్స‌రాల అనుభ‌వంతో, క‌ర్ణాటక తెలుగు ప్ర‌జ‌ల‌తో న‌రేంద్ర‌మోడీని దెబ్బ‌కొట్టించేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో పాటు టీడీపీ నాయ‌కులు , కార్య‌క‌ర్త‌లు నేరుగా క‌ర్ణాట‌కు వెళ్లి తెలుగు ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఓడిపోతే మోడీ గ్రాఫ్ తగ్గుతుంది భావించారు తెలుగుదేశం నాయ‌కులు. 
 
ఈ క్రమంలో టీడీపీ నాయ‌కుల ప్ర‌చారంతో భారతీయ జనతా పార్టీ కాస్త వెనుకబడినట్టుగా కనిపించింది. కానీ బీజేపీ నాయుకులు మాత్రం గెలుపే ల‌క్ష్యంగా చేసుకుని క‌ర్ణాట‌క‌లో విస్రృతంగా ప్ర‌చారం చేయ‌డంతో క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో బీజేపీ అత్య‌ధిక మెజారిటీతో గెలించింది. ఎన్నిక‌ల కౌంటింగ్ మొద‌ట్లో కాంగ్రెస్ పార్టీ మొదట పది సీట్లలో లీడ్ కొన‌సాగింది. దీంతో టీడీపీ నాయ‌కులు ఆనందంగానే ఉండి ఉంటారు.
 
కానీ ఆ త‌ర్వాత నుంచి బీజేపీ ఊపు అందుకుంది. క‌ర్ణాట‌క‌లో మొత్తం 222 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో బీజేపీ 106 స్థానాల‌ను కైవ‌సం చేసుకుని అధికార పిఠాన్ని ద‌క్కించుకుంది. ఇక మిగిలిన సీట్ల‌లో కాంగ్రెస్ 73 జేడీఎస్ 41 ఇండిపెండెంట్ నాయ‌కులు 2 స్థానాల‌ను ద‌క్కించుకున్నారు. ఇక ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను చూసిన టీడీపీ నాయ‌కులు కంగుతిన్న‌ట్లు తెలుస్తోంది. 
 
ఇక ఈ ఎన్నిక‌ల త‌ర్వాత ముఖ్య‌మంత్రికి చుక్క‌లే అని బీజేపీ నాయ‌కులు తెలిపిన సంగ‌తి తెలిసందే. దీంతో ఇప్పుడు చంద్ర‌బాబు పరిస్థితి ఏంటో అని విశ్లేష‌కులు చ‌ర్చించుకుంటున్నారు.  అయితే ఇప్ప‌టికే చంద్ర‌బాబును విమ‌ర్శిస్తూ బీజేపీ నాయ‌కులు సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.
 
ఈ క్ర‌మంలో చంద్ర‌బాబును విమ‌ర్శిస్తూ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ట్వీట్ చేశారు. కర్ణాటకలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎత్తుగడలు పనిచేయలేదని,  కర్ణాటక తెలుగు వారు బీజేపీకి అండగా నిలిచారని, దక్షిణాదిలో బీజేపీ విజయయాత్ర ప్రారంభమైందని రాంమాధవ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.