క‌మ‌లం క‌థ క్లైమాక్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-19 11:12:44

క‌మ‌లం క‌థ క్లైమాక్స్

దేశ రాజ‌కీయాల‌ను శాసిస్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి మ‌రి కొన్ని రోజుల్లో క‌ష్టాలు త‌ప్ప‌వనే చెప్పాలి. ఉత్త‌ర భార‌త‌దేశంలో త‌న బలాన్ని నిరూపించుకున్న బీజేపీ..... ద‌క్షిణాన పాగా వేసేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అక్కడ ప్రాంతీయ పార్టీల హ‌వా కొనసాగుతున్నందున బీజేపీ ప్లాన్స్ వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. 
 
కేంద్రంలో త‌మ పార్టీకి మెజారిటీ ఉంద‌ని జ‌బ్బ‌లు చ‌రుచుకుంటున్న క‌మ‌ల‌నాధులు ఏవేవో ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారు. ప‌దేళ్ల కాంగ్రెస్ పాల‌నలో విసుగెత్తి బీజేపీని ఆద‌రించార‌న్న అస‌లు స‌త్యాన్నిఆ పార్ఠీ నేత‌లు గ్ర‌హించ‌లేక‌పోతున్నారు. 
 
దీంతో త‌మ‌ను ప్ర‌జ‌లు పూర్తి స్దాయిలో న‌మ్ముతున్నార‌నే  భ్ర‌మ‌లో ఉన్నారు. ఎప్ప‌టి నుండో కేంద్రంలో ఉన్న ప్ర‌భుత్వాలు ద‌క్షిణాది రాష్ట్రాల‌ను విస్మ‌రిస్తున్నాయ‌నే అప‌వాద  ఉంది. దీనికి ప్ర‌స్తుత ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు జ‌రిగిన అన్యాయాన్నే ఉదాహ‌ర‌ణ‌గా చెప్పవ‌చ్చు. 
 
పెద్ద నోట్ల ర‌ద్దు, జీఎస్టీ వంటి ప‌లు నిర్ణ‌యాల కార‌ణంగా సామాన్య ప్ర‌జ‌లు ముఖ్యంగా ద‌క్షిణాది రాష్ట్రాలు  కేంద్రంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు తాజాగా ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ లో తెలుగు రాష్ట్రాల‌కు అన్యాయం తీవ్ర‌మైన ప‌రిణామం అనే చెప్పాలి.
 
 
బీజేపీ స‌ర్కార్ చేసిన అన్యాయంతో పోలిస్తే....... విభ‌జ‌న చేసినా కూడా  కాస్తో కూస్తో  కాంగ్రెస్ పార్టీనే న‌యం అనుకుంటున్నారు తెలుగు ప్ర‌జ‌లు. దీంతో రానున్న రోజుల్లో బీజేపీని ఇక్క‌డి ప్ర‌జ‌లు న‌మ్మే ప్ర‌సక్తే లేదు. ఇక త‌మిళ‌నాడులో పాగా వేయాల‌ని వ్యూహాలు ర‌చిస్తున్న మోదీకి త్వ‌ర‌లోనే ఊహించ‌ని షాక్ త‌గిలేలా ఉంది. 
 
ఇత‌ర పార్టీలు రాష్ట్రంలోకి రాకూడ‌ద‌నే ఉద్ద‌శ్యంతో హీరోలు క‌మ‌ల్ హాస‌న్, ర‌జ‌నీకాంత్ లు సొంతంగా పార్టీ పెట్టేందుకు సిద్ద‌మ‌య్యారు. త‌దుప‌రి ఎన్నిక‌ల్లో వీరిద్ద‌రూ క‌లిస్తే ఇక్క‌డ కూడా బీజేపీ క‌నుమ‌రుగ‌వ‌డం ఖాయం. ముఖ్యంగా త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌రగ‌నున్న క‌ర్ణాట‌క‌లో మ‌రోసారి కాంగ్రెస్ పార్టీనే జెండా ఎగుర వేసేందుకు తీవ్ర క‌స‌రత్తులు చేస్తోంది. దీంతో ఇక్క‌డ కూడా బీజేపికి క‌ష్టాలు త‌ప్పవు. 
 
కేర‌ళ‌లో ఎర్ర జెండాల‌ను కింద‌కు దించ‌డం అంతా ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. అక్క‌డ కూడా బీజేపీకి తీవ్రమైన వ్య‌తిరేక‌త ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని గెలిచిన బీజేపీ ఏపీలో మాత్రం  త‌న ఉనికి చాటుకుంది. ఇక ఇప్పుడు  నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌ధ్యంలో ద‌క్షిణాన భార‌తీయ జ‌న‌తా పార్టీ క‌థ క్లైమాక్స్ కు చేరుకుంది. ఇక రానున్న రోజుల్లో కూడా బీజేపీని ద‌క్షిణ భార‌తీయులు న‌మ్మే అవ‌కాశాలే లేవు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.