సీరియల్ రూపంలో బయటపెడతాం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-17 16:30:26

సీరియల్ రూపంలో బయటపెడతాం

టీటీడీ చైర్మన్ పదవిని నియమించినప్పటి నుంచి టీడీపీపైన విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అర్చకుల పైన తీసుకున్న నిర్ణయాలవల్ల మరింత వార్తల్లో నిలుస్తుంది టీటీడీ.. కొండ పైన జరుగుతున్న కుట్రల పైన ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా ఆరోపణలు చేశారు.టీడీపీ ప్రభుత్వం తిరుమలని బ్రష్టుపట్టిస్తున్నారని అన్నారు.
 
ఇప్పుడు టీటీడీలో జరుగుతున్న అవినీతిపైనా బీజేపీ అధికార ప్రతినిధి రంభోట్ల కూడా  ఘాటైన విమర్శలు చేసారు. SVBC ఛానల్ వాళ్ళు అన్ని పాలసీలు, అన్ని నీతి సూత్రాలు ఇచ్చి, వాటిని గాలికి వదిలేసి దాదాపుగా 132 కోట్లు మొత్తం కాంట్రాక్టులర్లకి లబ్ది చేకూర్చారని అన్నారు..ఈ లబ్ది పొందిన కాంట్రాక్టర్.. ఇప్పుడు  ఎవరినైతే SVBC చైర్మన్ గా నియమించారో ఆయనేదే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి అని అన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రంభోట్ల.
 
సుమారు 1000 కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకు ఇండస్ ఇండ్ లో డిపాజిట్ చేసారు.పబ్లిక్ సెక్టార్ బ్యాంకు లోనే డిపాజిట్ చేయాలనీ పబ్లిక్ సెక్టార్లో చాల స్పష్టంగా ఉంది. కానీ దానికి విరుద్ధంగా ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేసారు..ఇలా ఒకటా రెండా టీటీడీలో జరుగుతున్న అవకతవకలు అన్ని ఇన్ని కావు ఇంకా చాల ఉన్నాయి విమర్శలు చేసారు బీజేపీ అధికార ప్రతినిధి రంభోట్ల.
 
టీటీడీలో జరుగుతున్న అన్నిటికి ఆధారాలు సేకరిస్తున్నాము, ఆధారాలు సేకరించిన తర్వాత ముహూర్తం పెట్టి, ఒక సీరియస్ లాగ విడుదల చేస్తాం, ఆ సీరియస్ కత్చితంగా బంపర్ హిట్ అవుతుంది.  ఏదైనా ఒక ఛానల్ కి సీరియల్ రూపంలో టీటీడీలో ప్రశ్నోత్సరాలు అని ఇస్తే,  TRP రేటింగ్స్ బాగుంటాయి. వాళ్ళకి మంచి సీరియల్ అవుతుంది అని ఎద్దేవా చేసారు రంభోట్ల...తిరుమల క్షేత్రాన్ని వివాదాల, అక్రమాల పుట్టగా టీడీపీ మారుస్తుందని అన్నారు అయన ...తిరుమల కొండపై ఉన్న ప్రతిష్టతని ఎలా అధికారులు దెబ్బతిస్తున్నారో రమణ దీక్షితులు చెప్పారని అన్నారు

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.