గ‌ల్లా నేర చ‌రిత్ర గుట్టు విప్పిన‌ బీజేపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-13 11:17:56

గ‌ల్లా నేర చ‌రిత్ర గుట్టు విప్పిన‌ బీజేపీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్  రాజ‌కీయాల్లో మ‌రో సంచ‌ల‌నం... మిత్ర ప‌క్షంగా ఉన్న టీడీపీ-బీజేపీ మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ తారాస్ధాయికి చేరుకుంది. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ లో ఏపీకి అన్యాయం జ‌రిగిందంటూ పార్ల‌మెంట్ లో బీజేపీ పై గ‌ల్లా జ‌య‌దేవ్ చేసిన విమ‌ర్శ‌ల‌పై సీరియ‌స్ గా స్పందిస్తున్నారు క‌మ‌లనాధులు. 
 
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీపై ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డ్డ అసంతృప్తిని, అస‌హ‌నాన్ని బీజేపీపై నెట్టేందుకు టీడీపీ నేత‌లు  ప్ర‌య‌త్నిస్తే స‌హించేది లేదంటూ  బీజేపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌న్న‌పు రెడ్డి సురేశ్ రెడ్డి తీవ్ర స్ధాయిలో విరుచుకుప‌డ్డారు.
 
కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌పుడు అక్ర‌మంగా సంపాదించిన సొమ్ముతో టీడీపీకి డొనేషన్ ఇచ్చి ఎంపీ టికెట్ పొందిన గ‌ల్లా జ‌య‌దేవ్ లాంటి వ్య‌క్తి కాంగ్రెస్ కు ప‌ట్టిన గ‌తే బీజేపీకి ప‌డుతుంద‌ని చెప్ప‌డం ఏంట‌ని సురేష్ రెడ్డి ప్ర‌శ్నించారు.
 
అమ‌రావ‌తిలో ఎస్సీ, ఎస్సీల‌కు చెందిన‌ సుమారు రూ.40 ల‌క్ష‌ల విలువైన భూముల‌ను  కేవ‌లం రూ.40 వేల‌కు గ‌ల్లా జ‌య‌దేవ్  కొట్టేశార‌ని ఆయ‌న ఆరోపించారు. ఎమ్మార్ కేసులో రూ.130 కోట్ల కుంభ‌కోణానికి పాల్ప‌డిన గ‌ల్లా జ‌య‌దేవ్ ను సీబిఐ ప్ర‌త్యేక కోర్టు విచార‌ణ‌కు ఆదేశించిన విష‌యాన్ని గుర్తు చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.