వైసీపీలో సెప్టెంబ‌ర్ నెల‌లో చేరుతా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-23 18:38:48

వైసీపీలో సెప్టెంబ‌ర్ నెల‌లో చేరుతా

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఇటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌తో పాటు అటు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కీల‌క నాయ‌కులు కూడా ప్ర‌తిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అయితే ఇదే క్ర‌మంలో మాజీ ముఖ్య‌మంత్రి నేదురుమ‌ల్లి జ‌నార్ధ‌న్ రెడ్డి త‌న‌యుడు నెదుకుమ‌ల్లి రాంకుమార్ రెడ్డి వైసీపీ తీర్థం తీసుకోనున్నారు.
 
ఈ మేర‌కు ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోని త‌న అనుచ‌రుల‌తో స‌మావేశం అయి చ‌ర్చించారు. అనుచ‌రుల మేర‌కు ఆయన సెప్టెంబ‌ర్ లో పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకోనున్నారు. అంతేకాదు గూడూరు, చెన్నూరు, చిల్లకూరు ప్రాంతాల వైసీపీ ముఖ్య నేతలు నెదురుమ‌ల్లిని మర్యాద పూర్వకంగా కలిశారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపుకోసం ప్ర‌తీ ఒక్క‌రు కృషి చెయ్యాల‌ని ఆయ‌న  సూచించారు. వైసీపీ అధికారంలోకి వ‌స్తే రాష్ట్రం బాగుప‌డుతుంద‌ని మ‌ళ్లీ ప్ర‌జ‌లంద‌రు రాజ‌న్న ప‌రిపాల‌న చూడ‌బోతున్నామ‌ని తెలిపారు.
 
రాంకుమార్ ఎప్పుడు అయితే బీజేపీని వీడీ వైసీపీలో చేరుతాన‌న్నారో ఆ మ‌రుక్ష‌ణ‌మే పార్టీ త‌ర‌పున తొలిగించారు. ఇటు వైసీపీలోకి రాంకుమార్ రెడ్డి అలాగే ఆనం కూడా వైసీపీలోకి ఎంట్రీ అనే స‌రికి జిల్లాలో ప‌రిస్థితుల‌న్ని మారిపోయాయి. వీరిద్ద‌రిలో ఒక‌రిని తెలుగుదేశం పార్టీలో నిలుపుకోవాల‌ని చూసింది అధిష్టానం. అయితే ఈ క్ర‌మంలో ముందుగా ఆనంకు ఫ‌స్ట్ ప్ర‌యారిటీ ఇచ్చింది తెలుగుదేశం.
 
కానీ ఆయ‌న టీడీపీపై గుర్రున ఉండ‌టంతో రాంకుమార్ వైపు మాకం మార్చింది. కానీ ఆయ‌న బీజేపీ నుంచి వైసీపీలో చేరుతున్నాన‌ని తెలుప‌డంతో టీడీపీ అధిష్టానం సైలెంట్ అయింది. మొత్తానికి రాం కుమార్ పార్టీలో చేర‌కుముందే జిల్లాలో ఉన్న బీజేపీ నాయ‌కుల‌ను ప్ర‌స్తుత వైసీపీ నాయ‌కులతో క‌లిసి ముందుకు వెళ్ల‌డం పై ఇప్పుడు అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. పార్టీ త‌ర‌పున జ‌గ‌న్ ఆయ‌న‌కు ఎటువంటి ప‌ద‌వి ఇస్తారా అని నాయ‌కులు కూడా ఆలోచిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.