ఆదినారాయ‌ణ రెడ్డికి స‌రికొత్త చిక్కులు.....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-23 01:14:38

ఆదినారాయ‌ణ రెడ్డికి స‌రికొత్త చిక్కులు.....

తెలుగుదేశం ప్ర‌భుత్వం పై ఎన్ని అవినీతి మ‌చ్చ‌లు - మ‌ర‌క‌లు ప‌డుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కూ  ఏపీ క‌మ‌లం పార్టీ నాయ‌కులు వాటిని ఖండించి కేంద్రానికి ఫిర్యాదుచేశారు.. అయితే తెలుగుదేశం నాయ‌కులు మాత్రం ఏపీ బీజేపీ నాయ‌కుల పై విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారు అంటూ తిరిగి రివ‌ర్స్ కౌంట‌ర్ ఇచ్చేవారు.. ఇప్పుడు ప‌రిస్ధితి మ‌రింత మారింది.. కేంద్రం తెలుగుదేశానికి క‌టీఫ్ చెప్ప‌డానికి సిద్దంగా ఉంది.. దీంతో తెలుగుదేశాన్ని వెంట్రుక‌లా చూస్తున్నారు అనే డైల‌మాలో ఉన్నారు త‌మ్ముళ్లు.
 
ఇప్ప‌టి వ‌ర‌కూ కేంద్రం పై ప్ర‌శ్నించే స్ధాయి తెలుగుదేశం నాయ‌కుల‌కు ఎట్టి ప‌రిస్దితుల్లో లేదు అని విమ‌ర్శిస్తున్నారు కాషాయ‌ద‌ళ నాయ‌కులు... ఇక తెలుగుదేశం నాయ‌కుల‌ను మాట్లాడ‌నివ్వ‌కుండా చేయాలి అని వ్యూహాలు ప‌న్నుతున్నారు...టీవీ చ‌ర్చ‌ల్లో కాని, స‌మావేశాల్లో కాని బీజేపీ పై విమ‌ర్శ‌లు చేసే ఛాన్స్ తెలుగుదేశానికి  ఇవ్వ‌కుండా చేయాలి అని ఆలోచిస్తోంది బీజేపీ.
 
తాజాగా రాజ‌కీయా పార్టీలు తెలుగుదేశం నాయ‌కులు సిగ్గుప‌డేలా ఓమాట అన్నారు మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి.. ప్ర‌తీ దానిలో అర్ధ రూపాయి నాకు అర్ధ రూపాయి ఎమ్మెల్సీ రామ‌సుబ్బారెడ్డికి వ‌చ్చేలా ఇద్ద‌రు ఐఏఎస్ అధికారుల మ‌ధ్య చంద్ర‌బాబు రాజీ కుద‌రిర్చారు అని అన్నారు... ఈ వీడియో ఇప్ప‌డు ఏపీలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.. అయితే ఏపీకి నిధులు అడిగితే స‌మాధానాలు లెక్క‌లు చెప్ప‌ని తెలుగుదేశం పై, ఏపీలో క‌మ‌లం పార్టీ నాయ‌కులు ఫిర్యాదులు చేస్తున్న సంగ‌తి విధిత‌మే... తాజాగా ఏపీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు పెనుదుమారం లేపుతున్నాయి. అలాగే కేంద్రానికి దీనిపై ఫిర్యాదు చేశారు రాష్ట్ర బీజేపీ నాయ‌కులు.
 
దీనిపై బీజేపీ నాయ‌కులు అన్ని ఆధారాలతో కూడీన వీడియో ఆడీయో టేపుల‌ను పంపుతున్నార‌ట‌... కేంద్రంలో అమిత్ షాకు మోదీకి ఈ అర్ధ‌రూపాయి వ్య‌వ‌హారం వివాలు అన్ని పంపార‌ట... ఇప్పుడు  దీనిపై అమిత్ షా, మోదీతో చ‌ర్చించి ఓ ఫైన‌ల్ డెసిష‌న్ కు వ‌స్తార‌ని,  తీసుకున్న నిధుల‌కు లెక్క‌లు చెప్ప‌కుండా అన్నీ  తెలుగుదేశం ప‌థ‌కాలుగా ఇక్క‌డ ప్ర‌క‌ట‌న‌లు - ప్రచారాలు చేసుకుని బీజేపీపై మోదీ పై విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని త‌ప్పుబ‌డుతున్నారు బీజేపీ నాయ‌కులు. మ‌రి ఫిరాయింపు ఎమ్మెల్యే కం మంత్రి ఇలా తెలుగుదేశాన్ని ఇరికించ‌డంపై ఏపీ మంత్రులు కూడా డైల‌మాలో ఉన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.