హీరో శివాజీపై దాడి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-21 01:14:05

హీరో శివాజీపై దాడి

కేంద్రం ప్ర‌క‌టించిన బ‌డ్జెట్ లో ఏ రాష్ట్రానికి జ‌ర‌గ‌ని అన్యాయం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు జ‌రిగింది... విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న ప్ర‌త్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ హామీల‌ను ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో కేంద్రానికి వ్య‌తిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో !!సేవ్ ఏపీ!! అంటూ నినాదాలు చేస్తున్నారు ప్ర‌జా ప్ర‌తినిధులు..అయితే ఈ నేప‌థ్యంలో హోదా సాధ‌న కోసం ప‌లు మీడియా ఛాన‌ల్స్ కూడా జిల్లాల వారీగా చ‌ర్చ‌లను ముమ్మ‌రంగా సాగిస్తున్నాయి.
 
అయితే తాజాగా విజ‌య‌వాడ‌లో ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ ఆధ్వ‌ర్యంలో హోదా సాధ‌న పై చ‌ర్చ నిర్వ‌హించారు... ఈ చ‌ర్చ‌కు సినీ న‌టుడు  శివాజీ హ‌జ‌ర‌య్యారు... ఈ చ‌ర్చ‌లో ఆయ‌న మాట్లాడుతూ ... రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత పూర్తిగా న‌ష్ట‌పోయిన ఏపీకి తాము ఆధికారంలోకి వ‌చ్చాక హోదా, రైల్వే జోన్ తో పాటు కేంద్ర విశ్వ‌విద్యాలాయాలు, ఫ్యాక్ట‌రీలు వంటి వాటిని ఇస్తామ‌ని చెప్పిన బీజేపీ.... నాలుగు ఏళ్లు గ‌డిచినా వీటిని ప్ర‌క‌టించ‌లేద‌ని శివాజీ అన్నారు.....  బీజేపీ చెప్పిన మాటలను నమ్మి 2014 ఎన్నికల్లో తాను ఆ పార్టీకి మద్దతిచ్చానని తెలిపారు.
 
అందులో భాగంగానే ఏ పార్టీ ప్ర‌క‌టించ‌ని అబ‌ద్ద‌పు ప్ర‌క‌ట‌న‌ల‌ను బీజేపీ  స‌ర్కారు ప్ర‌క‌టిస్తోంద‌ని, మోదీ జీరో.. మోదీ జీరో అంటూ శివాజీ  నినాదాలు చేశారు... అదే స‌మ‌యంలో బీజేపీ కార్య‌క‌ర్త‌లు క‌ల్పించుకుని  శివాజీ.. డౌన్ డౌన్ అంటూ వారు కూడా నినాదాలు చేశారు...ఆగ్రహంతో శివాజీ మిమ్మ‌ల్ని ఇంత‌వ‌ర‌కూ  ప్ర‌జ‌లు మాట్లాడ‌నిస్తున్నార‌ని, ఇంకొద్ది రోజుల పాటు ఇదే కొన‌సాగితే ప్ర‌జ‌లు బీజేపీ నాయ‌కుల‌ను త‌రిమి త‌రిమి కొడ‌తార‌ని అన్నారు... దీంతో బీజేపీ కార్య‌క‌ర్త‌లు మ‌ధ్య శివాజీ మ‌ధ్య తోపులాట చోటు చేసుకుంది.. ఈ తోపులాట‌లో కార్య‌క‌ర్త‌లు శివాజీ మీద ప‌డ్డారు...  దీంతో అక్కడే ఉన్న ప్రజా సంఘాలు, ప్రజలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.