టీడీపీ దీక్ష‌ల‌కు ఖ‌జానా క‌ర‌గాల్సిందే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-05 18:31:51

టీడీపీ దీక్ష‌ల‌కు ఖ‌జానా క‌ర‌గాల్సిందే

ఎవ‌రో ఏదో చెప్పిన‌ట్టు దీక్ష‌ల‌తో కాలం వెల్ల‌దీశారు అనే సామెత ఉంది ఇది ఇప్పుడ అచ్చం సూట్ అయ్యేలా కనిపిస్తోంది ఏపీ రాజ‌కీయాల్లో... ఇస్తే ఇవ్వండి ఇవ్వ‌క‌పోతే మేమే ఏదైనా చేసుకోగలం మీ సాయం లేకుండా అమ‌రావ‌తి నిర్మించుకుంటున్నాం అని చెబుతూనే, కేంద్రం మ‌న‌కు అన్యాయం చేసింది అని స‌న్నాయి వాయిస్తున్నారు.. మొత్తానికి తెలుగుదేశం నాయ‌కుల మాట‌లు ఆ పార్టీ నాయ‌కులు చేసే వ్యాఖ్య‌ల‌కు అర్దం ఎలా ఉండదో, ఇటు దీక్ష‌లు కూడా అర్దం కావ‌డం లేదు అని అంటున్నారు ప్ర‌జ‌లు.
 
మొత్తానికి ఎవ‌రైనా నిరాహార‌దీక్ష చేస్తే సాయంత్రానికి టెంట్ సామాగ్రి షామియానాకి, నాయ‌కులు ఇంటికి చేరుకుంటారు.. ఇక ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష అంటే ఇక కాస్తో కూస్తో ఇప్ప‌టికి న‌మ్మేదీక్ష అదే, అందుకే సీఎం ర‌మేష్ క‌డ‌ప‌లో చిర‌స్దాయిగా నిలిచిపోయేలా 11 రోజులు దీక్ష చేశారు..ఇక సీఎం చంద్ర‌బాబు ఆయ‌న‌కు నిమ్మ‌ర‌సం ఇచ్చారు దీక్ష విర‌మింప చేశారు ఇదంతా గ‌డిచిన క‌థ‌.
 
ఇక వ‌ర్త‌మానంలో తెలుగుదేశం భ‌విష్య‌త్తుకు పావులు క‌దుపుతోంది అనేది స్ప‌ష్టంగా తెలిసిపోయింది..హ‌స్తిన‌లో ఈ దీక్ష‌ల‌పై కామెంట్లు చేసిన టీడీపీ ఎంపీలు నాయ‌కులు.. విశాఖలో ఓ రోజు రైల్వేజోన్ కోసం దీక్ష  చేయ‌డం చూస్తుంటే ఆలోచ‌న మ‌రింత పెరిగిపోయింది ప్ర‌జ‌లు అంద‌రికి .. ఎన్నిక‌ల ఎత్తుగ‌డ‌ల‌కు మ‌రో పది నెల‌లు ప‌ది దీక్ష‌లు ఇలాంటివి చేస్తే మ‌న‌కు విజ‌యం త‌థ్యం అనేది సైకిల్ పార్టీ ఆలోచ‌న‌.
 
స‌హేతుక‌మైన కార‌ణాలు చూపించి దీక్ష‌లు చేస్తే బాగుంటుంది, అస‌లు వీరు చెప్పేదానికి చేసే ప‌నికి సంబంధం లేదు అని ప్ర‌తిప‌క్ష పార్టీ నుంచి ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక ప‌వ‌నాలు వ‌స్తున్నాయి... నాలుగేళ్లు బీజేపీతో క‌లిసి ఉండి ఆ నాడు అడ‌గ‌ని హామీలు అన్నీ నేడు ఏక‌ర‌వు పెట్ట‌డం పై ప్ర‌జ‌లు కూడా ఆలోచిస్తున్నారు...పార్టీ ఫండ్ ప్ర‌భుత్వ ఖ‌జానాకు ఖ‌ర్చు మినహా ఈ ఎనిమిది గంట‌ల పార్ట్ టైం దీక్ష‌ల వ‌ల్ల ఎటువంటి ఉప‌యోగం లేదు అని చెబుతున్నారు ప్ర‌జ‌లు.. ఈ పార్టీలు ఇలా దీక్ష‌లు చేసుకుంటూ పోతే రేపు మీ దీక్ష‌ల వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది అని ప్ల‌కార్డులు ప‌ట్టుకుని నిర‌స‌న‌లు తెలిపినా ఆశ్చ‌ర్య‌పోవ‌క్క‌ర్లేదు సుమా..?

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.