సీబీఐ ద‌గ్గ‌ర‌కు బాబు ప‌థ‌కాలు ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-16 13:06:43

సీబీఐ ద‌గ్గ‌ర‌కు బాబు ప‌థ‌కాలు ?

ఏపీలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న కార్య‌క్ర‌మాలు ప్ర‌చారాలు ప్ర‌గ‌ల్బాల‌పై తెలుగుదేశం నాయ‌కుల‌పై వైసీపీ,  జ‌న‌సేన కూడా విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే... ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు ప‌థ‌కాలు అన్ని కేంద్రం నుంచి నిధులు వ‌చ్చిన వాటికి కూడా చంద్ర‌న్న ప‌థ‌కాలుగా ప్ర‌చారం చేసుకున్నారని, ఏపీకి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చినా అన్నింటిని ఏపీ స‌ర్కారు ఖాతాలో తెలుగుదేశం పార్టీ వేసుకుంది అని విమ‌ర్శ‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.
 
ఇటు కేంద్రంలో ఉన్న బీజేపీ నేత‌లు ఇదే అంశాన్ని నిరంతం ప్ర‌చారం చేసేవారు, కాని ఇటు బీజేపీ తెలుగుదేశం క‌లిసి ఎన్డీయేలో ఉండ‌టంతో వారు కూడా ఎటువంటి విమ‌ర్శ‌లు చేయ‌లేదు... ఇటు ఏపీలో తెలుగుదేశం పార్టీ పై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా వాటిని తిప్పికొట్ట‌డంలో తెలుగుదేశం స‌క్సెస్ కాలేక‌పోయింది.. దానికి ప్ర‌ధాన కార‌ణం కూడా ఉంది.
 
ముఖ్యంగా స‌ర్కారు పై వ‌స్తున్న విమ‌ర్శ‌లను తిప్పికొట్ట‌లేక‌పోయారు టీడీపీ కేడ‌ర్.. ఇటు బీజేపీతో క‌లిసి ఉన్న స‌మ‌యంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలుగుదేశం ప‌నుల‌ను కార్య‌క్ర‌మాల‌లో అవినీతిని విమ‌ర్శించేవారు... ఇక ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత బీజేపీ మ‌రింత తెలుగుదేశం పై విమ‌ర్శ‌లు చేస్తుంటే, ఇటు తెలుగుదేశం కూడా బీజేపీ పై విమ‌ర్శ‌ల దాడి పెంచింది.
 
రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన పథకాల్లో భారీ అవినీతి చోటుచేసుకుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. నీరు-చెట్టు, హౌసింగ్‌లో జరిగిన అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామన్నారు. చంద్రబాబు పులి మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టే.. కేవలం హౌసింగ్‌లోనే 30 కోట్ల దోపిడి జరిగిందని ఆరోపించారు. మరో పదిలక్షల ఇళ్లు మంజూరు చేస్తే లక్ష కోట్ల కుంభకోణం జరిగేదని వ్యాఖ్యానించారు.
 
మరో సంపూర్ణ విప్లవం రావాలని.. లేదంటే చంద్రబాబుతో ప్రమాదమని తెలిపారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ను కచ్చితంగా ఏర్పాటు చేస్తామన్నారు. కానీ రాష్ట్ర  ప్రభుత్వం సహకరించడం లేదన్నారు...మొత్తానికి ఏపీ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను, తెలుగుదేశం పార్టీ అవ‌లంభించి ప్ర‌చారం చేసిన ప‌థ‌కాల‌పై కేంద్రానికి ఫిర్యాదుచేసేందుకు బీజేపీ రెడీ అవుతోంద‌ని స్ప‌ష్టం అవుతోంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.