బీజేపీ సంచ‌ల‌న డెసిష‌న్‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-21 13:03:30

బీజేపీ సంచ‌ల‌న డెసిష‌న్‌

తెలుగు అంటే మొద‌ట‌గా తెలుగుదేశం నాయ‌కుల పేర్లు వినిపిస్తాయి.. ఓ ఎమ్మెల్సీ రాజేంద్ర‌ప్ర‌సాద్, ఓ వ‌ర్ల రామ‌య్య, ఓ బొండా ఉమ‌, ఓ చింత‌మ‌నేని,  అద్బుత‌మైన తెలుగు మాట్లాడే మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా ఉంటుంది.. ఇక ప‌ద్యాలు పాట‌లు పాడిన‌ట్లు బాల‌య్య కూడా తెలుగు అద్బుతంగా మాట్లాడ‌తారు.. 
 
సీఎం ధ‌ర్మం పోరాట ఎక్సెట్రా 12 గంట‌ల ఉప‌వాస‌దీక్ష ప్ర‌త్యేక హూదా దీక్ష  స‌భ‌లో అంద‌రూ ఉండ‌గా ప్ర‌ధాని మోదీ ఏపీకి ఏమి ఇచ్చాడు, మోదీ మ‌ట్టి నీళ్లు ఇచ్చాడు ఏ మాకు లేవా అరే శిఖండి అంటూ అలా త‌న నోటికి ప‌ని చెప్పి ఫుల్ స్టాప్ లేకుండా తిట్ల పురాణం విప్పారు  ఎమ్మెల్యే బాల‌య్య‌.. ఇక ఆయ‌న తిట్లు ఎలా ఉన్నా ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు ఆయ‌న ప‌లుకుల పై మౌనంగానే ముసిముసిగా న‌వ్వుతూ క‌నిపించారు..
 
ఇక బీజేపీ నాయ‌కులు దీనినే ప‌ట్టుకున్నారు ఓ ప‌క్క బాల‌య్య ప్ర‌ధానిని తిడుతుంటే నాలుగేళ్లు వంగుని న‌మ‌స్కారాలు చేసిన మీరు ముసి ముసి న‌వ్వులు న‌వ్వుతారా అంటూ ఓ కొత్త పాయింట్ ప‌ట్టుకున్నారు.. అస‌లే క‌ర్నాట‌క ఎన్నిక‌లు ఈ స‌మ‌యంలో నేష‌న‌ల్ మీడియా కూడా ఓ ప‌ట్టాన ఫోక‌స్ చేస్తుంది పైగా బాల‌య్య ఓ హీరో ఆయ‌న మాట‌ల‌కు మ‌రింత టీఆర్పీ పెంచేలా దూసుకుపోతుంది..
 
ఇక బీజేపీ బాల‌య్య పై విరుచుకుప‌డింది మీ గ‌తం ఏమిటి  మీ నాన్న ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన వారి వెనుక పార్టీ కండువా వేసుకుని సేవ చేస్తున్నారు... మీకు చేత‌కాకే మీ తండ్రి సీఎం కుర్చీ మీ బావ తీసుకున్నారు అంటూ బీజేపీ ఫైర్ అవుతోంది.. బాల‌య్య మాటలు వింటుంటే ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందని  బీజేపీ సభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు
 
ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను బాలకృష్ణ వెంటనే ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పకపోతే, కేసులు పెడతామని హెచ్చరించారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి సీఎం చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ మాధవ్‌ మాట్లాడుతూ.. బాలకృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.ప్రధాని మోదీపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించాలని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.
 
మోదీ శిఖండిలా, కొజ్జాలా రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు. దీంతో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యాలపై రాష్ట్ర బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది....ఈ క్రమంలో శనివారం విశాఖ పర్యటనలో ఉన్న గవర్నర్‌ నరసింహన్‌తో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ధర్మ పోరాట దీక్షలో మోదీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే విష్టుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌లు ఈ సందర్భంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.  బీజేపీ నేతలు మాట్లాడుతూ.. రాజ్యాంగం పట్ల గౌరవం లేని వ్యక్తి ప్రజాప్రతినిధిగా కొనసాగే హక్కు లేదని అత‌నిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.