స‌ర్కార్ కు వ్య‌తిరేకంగా ధ‌ర్నా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp vs bjp
Updated:  2018-10-10 12:17:03

స‌ర్కార్ కు వ్య‌తిరేకంగా ధ‌ర్నా

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వ‌చ్చినా స‌రే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చ‌క్కెర ఫ్యాక్ట‌రీలతో పాటు పాల‌ డైరీలు కూడా మూత ప‌డుతాయని భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మండిప‌డ్డారు. తాజాగా చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టించిన ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... గ‌తంలో ఎన్న‌డూ జ‌రుగ‌ని విధంగా టీడీపీ నాయ‌కుల హయాంలో అవినీతి జ‌రుగుతుంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 
 
కేవ‌లం టీడీపీ నాయ‌కులు త‌మ స్వ‌లాభం కోసం చ‌క్కెర ఫ్యాక్ట‌రీల‌ను మూయించార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. రేణిగుంట‌లో మాండ్యం చ‌క్కెర ఫ్యాక్ట‌రీని మూయించిన ఘ‌న‌త చంద్ర‌బాబు నాయుడుకే ద‌క్కుతుంద‌ని క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ ఆరోపించారు. ఈ ఫ్యాక్ట‌రీని న‌మ్ముకున్న కార్మికులు ప్ర‌స్తుతం రోడ్డున ప‌డ్డార‌ని, దీనంత‌టికీ కార‌ణం చంద్ర‌బాబు నాయుడే అని ఆయ‌న మండిప‌డ్డారు.
 
2014లో అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ నాయ‌కులు ప్ర‌జా సేవ చేయ‌కుండా రాష్ట్రాన్ని అవినీతి ఆంధ్ర‌ప్ర‌దేశ్ గా మార్చార‌ని క‌న్నా మండిప‌డ్డారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రైతులంద‌రూ చంద్రబాబు నాయుడుకు త‌గిన బుద్ది చెబుతార‌ని ఆయ‌న ఆరోపించారు. అంతేకాదు ఈ రోజు చ‌క్కెర ఫ్యాక్ట‌రీ మూసివేత‌కు వ్య‌తిరేకంగ మాండ్యంలో ధ‌ర్నాను చేస్తున్నామ‌ని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ స్ప‌ష్టం చేశారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.