విష్ణుకుమార్ రాజుకు జ‌గ‌న్ ఆఫ‌ర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-26 16:33:30

విష్ణుకుమార్ రాజుకు జ‌గ‌న్ ఆఫ‌ర్

ఒకే పార్టీని న‌మ్ముకున్నా ఒకే ఉద్యోగాన్ని న‌మ్ముకున్నా పైకి వ‌చ్చేది చాలా త‌క్కువ... ఉదాహ‌ర‌ణ‌గా సీఎం చంద్ర‌బాబును చూపిస్తారు రాజ‌కీయాల్లో... వైయ‌స్, చంద్ర‌బాబు రాజ‌కీయం ఒకేసారి మొద‌లు పెట్టారు... ఆనాడు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వెళ్లి ఎలాగో అలాగ సీఎం అయ్యారు చంద్ర‌బాబు... అదే కాంగ్రెస్ లో ఉండి ఉంటే బాబు రాజ‌కీయం వేరేలా ఉండేది... అందుకే ఎప్పుడు ఎవ‌రి ఫేట్ ఎలా ఉంటుంది అనేది ఎవ‌రికి తెలియ‌దు?
 
ఇప్పుడు రాజ‌కీయంగా ఎంత పార్టీకి అంతే ప‌ద‌వి అనేది తెలిసిందే.... ప్రాంతీయ పార్టీల్లో ఉండే రాజ‌కీయ ప‌ద‌వులు స్టేట్ లెవ‌ల్లో ఉంటాయి... జాతీయ పార్టీలో ఉంటే ప‌ద‌వులు సెంట్ర‌ల్ లెవ‌ల్లో ఉంటాయి.. ఇక బీజేపీ ఇప్పుడు ఏపీకి ఎటువంటి ప్ర‌యోజ‌నం చేసేలా క‌నిపించ‌డం లేదు ప్ర‌త్యేక హూదా విష‌యంలో... దీంతో ఏపీ బీజేపీ నాయ‌కులు కూడా ఎటూ  పాలుపోని స్దితిలో ఉన్నారు...
 
మొత్తం మోదీని చూపించి  2014 ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేశారు... ఆరెస్సెస్ నుంచి బీజేపీలో చ‌క్రం త‌ప్పిన ప్ర‌తీ ఒక్క‌రు మా ఐకాన్ మోదీ అన్నారు... ఆయ‌న పీఎం అయ్యారు అయితే, మోదీ అన్ని రాష్ట్రాల్లో తిరుగులేని విజ‌యం సాధించే స‌రికి కొత్త కొత్త నిర్ణ‌యాల‌తో రాజ‌కీయంగా దేశ‌వ్యాప్తంగా ప్ర‌శ్న‌లు రెకెత్తించారు.. 
 
ఇక్క‌డ 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ తెలుగుదేశం తో  పొత్తుపెట్టుకుంది... సైకిల్ పార్టీతో స్నేహం మెజార్టీ వ‌ద్దు అన్నా?  అథారిటీ నిర్ణ‌యం అలా వ‌చ్చింది... చివ‌రకు ఇక్క‌డ పొలిటికల్ ఈక్వేష‌న్లు మారిపోయాయి.. 2018 లో బీజేపీ తెలుగుదేశం ఫ్రెండ్ షిప్ మునిగి పోయింది... ఇక తెలుగుదేశం నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌ధాని మోదీ పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు... ఇక  ఎమ్మెల్యే బాల‌య్య కూడా ఇటీవ‌ల సీఎం, 12 గంట‌ల ధర్మ పోరాట దీక్ష‌లో త‌న ఉప‌న్యాసం ఇచ్చారు...
 
అలాగే ప్ర‌ధాని పై గుజ‌రాత్, దిల్లీ వినిపించేలా అరిచేశారు... రాజ భాష హిందీలో స్పీచ్ ఇచ్చారు బాల‌య్య‌...మోదీపై విమ‌ర్శ‌లు చేశారు అవి అర్ధం కావ‌డానికి రెండు గంట‌లు ప‌ట్టినా అవి అన్ని ప‌ర‌మ దారుణ‌మైన అవ‌మాన‌పూరిత వ్యాఖ్య‌లు అని ప్ర‌జ‌లు అంద‌రికి తెలిసిందే... ఇక్క‌డ క‌మ‌లం నాయ‌కులు కూడా బాల‌య్య పై శివాలెత్తారు బాల‌య్య పై గ‌వ‌ర్న‌ర్ కు కంప్లైంట్ ఇచ్చారు.
 
ఇక రాజ‌కీయంగా తెలుగుదేశంతో, ఇన్ని తిట్లు తిట్టి తిట్టించుకుని తిడుతూ ఆ పార్టీలోకి  వెళ్ల‌డం ఎందుకు అని కొంద‌రు అనుకుంటున్నారు... అందుకే వైసీపీ వైపు నేరుగా క్యూ క‌డుతున్నారు... ఏకంగా సంవ‌త్స‌రం ఉండ‌గానే వైసీపీలోకి త‌మ ఎంట్రీ పై డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నారు.. పైగా తెలుగుదేశం నాయ‌కులు  ఎలా ఉన్నా వైసీపీలోకి బీజేపీ నాయ‌కులు క్యూ క‌డుతున్నారు... బీజేపీ నాయ‌కులు  స్టేడ్ లీడ‌ర్స్  కాట‌సాని, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వైసీపీలోకి తమ ఎంట్రీ పై డేట్స్ ప్ర‌క‌టించారు. ఇటు తెలుగుదేశం నుంచి మ‌రో న‌లుగురు మాజీలు కూడా వైసీపీ కి చేర‌డానికి రెడీ అవుతున్నారు.
 
అయితే ఇప్ప‌డు కొత్ వాద‌న వినిపిస్తోంది..... బీజేపీ కోసం దశాబ్దాల నుంచి పనిచేసిన వారు ఎవ‌రూ పార్టీని వీడ‌టం లేదు.. వారు బీజేపీలోనే ఉంటున్నారు... అయితే ఈ లిస్టులో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేరు వినిపిస్తోంది. ఆయ‌న కూడా వైసీపీలోకి వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి అంటున్నారు కొంద‌రు.. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌పున నిల‌బ‌డితే విజ‌యం ప‌క్క‌న పెడితే అస‌లు డిపాజిట్ వ‌చ్చే అవ‌కాశం లేదు...
 
అందుకే ఎవ‌రికి వారు స‌ర్దుకుంటున్నారు రాజ‌కీయంగా అని అంటున్నారు.. అయితే విష్ణుకుమార్ రాజు వైసీపీలోకి వ‌చ్చినా ఎటువంటి ఆశ్చ‌ర్యం లేదు అంటున్నారు కొంద‌రు.. ఆయ‌న‌కు జ‌గ‌న్ పై ఎప్పుడూ మంచి అభిప్రాయం ఉంటుంది... జ‌గ‌న్ మెండి వాడు చేసేది తాను అనుకున్న‌ట్లుగా వెళ‌తారు అని వైసీపీ నాయ‌కుల‌తో కూడా అంటార‌ట... అయితే ఆయ‌న పాద‌యాత్ర‌లో క‌ష్ట‌ప‌డుతున్నారు ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో విశ్వాసం పెర‌గింది అని ప‌లుసార్లు అన్నారు.. సో రాజ‌కీయంగా బీజేపీ నాయ‌కులు అంద‌రూ వ‌ర‌స‌పెట్టి వైసీపీలో చేరుతుంటే ఆయ‌న కూడా వైసీపీ వైపు వ‌చ్చినా ఆశ్య‌ర్య‌పోవ‌క్క‌ర్లేదు అంటున్నారు కొంద‌రు విశ్లేష‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.