బాబు ఇంటి పై బీజేపీ స్కెచ్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

bjp and tdp
Updated:  2018-04-10 11:24:06

బాబు ఇంటి పై బీజేపీ స్కెచ్ ?

ఏపీ రాజ‌కీయం గోదావ‌రిలో సుడిగుండాల్లా చ‌క్క‌ర్లు బొంగ‌ర్లు తిరుగుతోంది... రాజ‌కీయ నాయ‌కులు త‌మ పార్టీల త‌ర‌పున నిర‌స‌న‌లు దీక్ష‌లు ప్ర‌ధాని ఇంటి ముందు ప్లకార్డులు పట్టుకుని నిర‌స‌న తెలియ‌చేయ‌డం ఏపీ రాజ‌కీయం మ‌రోసారి తెలంగాణ ఉద్య‌మం స‌మైఖ్యాంద్రా ఉద‌మ్యాన్ని త‌ల‌పిస్తోంది.. ముఖ్యంగా ఇక్క‌డ చంద్ర‌బాబు చేసిన రాజ‌కీయం చూసి ముందు ప్ర‌త్యేక హూదా కావాలి అని కోరారు.
 
త‌ర్వాత ప్ర‌త్యేక హూదా వద్దు అన్నారు ప్ర‌త్యేక ప్యాకేజీ బాగుంది అని స్వాగ‌తించారు.. దీంతో బాబు సీనియ‌ర్ ఆయ‌న ఏం చెప్పినా క‌రెక్ట్ అని అంద‌రూ న‌మ్మారు... ఇప్పుడు వైసీపీ ప్ర‌త్యేక హూదా పైనే నిల‌బ‌డ‌టంతో ఆల్ ఇస్ క్లియ‌ర్ వి వాంట్ ప్ర‌త్యేక హూదా అన్నారు.. దీంతో ప్ర‌జ‌లు కూడా రాజ‌కీయంగా చంద్రబాబు ఎత్తులు వేసి మ‌న‌ల్ని బ‌లిప‌శువులు చేస్తున్నారు అని గుర్తించి, తెలంగాణ ఉద్య‌మంలా రోడ్ల పైకి రావ‌డం లేదు.. ఇటు ప్ర‌తిప‌క్ష వైసీపీ అధికార తెలుగుదేశం పార్టీ మాత్ర‌మే రాజ‌కీయంగా పోరాటం చేస్తున్నాయి. అందుకే ప్ర‌జ‌లు ఈ పోరాటంలో పాలుపంచుకోవ‌డం లేదు.
 
అయితే బీజేపీ నాయ‌కులు తెలుగుదేశం అధినేత పై తెలుగుదేశం ఎంపీల‌పై గుర్రుగా ఉన్నారు.. ప్ర‌ధాని ఇంటి ముందు నిర‌స‌న చేసి ధ‌ర్నా తెలిపిన తెలుగుదేశం ఎంపీలు ఎప్పుడూ  ఓమాట మీద లేర‌ని, గ‌తంలో తెలుగుదేశం ఎంపీలు ప్ర‌త్యేక  ప్యాకేజీ బాగుంది అని చెప్పి ఇప్పుడు బాగోలేదు ప్ర‌త్యేక హూదా కావాలి అని మాట మార్చ‌డం ఏమిటి ఇదేనా ఎంపీల ప‌ద్ద‌తి అని బీజేపీ ప్ర‌శ్నిస్తోంది.
 
ప్రధాని ఇంటి వద్ద టీడీపీ ఎంపీలు ధర్నాకు యత్నించడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీజేపీ కూడా కొత్త ప్లాన్ వేస్తోంద‌ట, ప్ర‌ధాని ఇంటి ముందు ముట్ట‌డి చేసి ధ‌ర్నా తెలుగుదేశం ఎంపీలు తెలియ‌చేశారు కాబ‌ట్టి, ఇక్క‌డ ఏపీలో సీఎం  చంద్ర‌బాబు చేసిన ప‌నులు అమ‌రావ‌తి నుంచి అన్నింటా సీబీఐ ఎంక్వైరీ వెయ్యాల‌ని అలాగే కేంద్రం నుంచి వ‌చ్చిన నిధులు ఏం చేశారో తెలియ‌చేయాలి అని బీజేపీ నాయ‌కులు బాబు ఇంటిని ముట్ట‌డించాల‌ని అనుకుంటున్నార‌ట‌.. ప్ర‌ధాని ప‌రువుకు భంగం క‌లిగించేలా క‌ర్ణాటక ఎన్నిక‌ల ముందు చేసి ఇది నా క్రెడిట్ నా వ‌ల్లే ఇలా జ‌రిగింది అని చంద్ర‌బాబు చెప్పేలా ఆలోచిస్తున్నారు అని బీజేపీ విమ‌ర్శిస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.