బాబుకు మ‌రో షాక్....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-19 10:33:00

బాబుకు మ‌రో షాక్....

అదును చూసి వేటు వేయ‌డం అన్ని రాష్ట్రాల‌లో బీజేపీకి అలావాటుగా మారుతోంది... తాజాగా ఏపీపై క‌న్నుప‌డింది క‌మ‌లం పార్టీకి...  ఏపీ ప్ర‌త్యేక హూదా నినాదం, స్పెష‌ల్ ప్యాకేజీ విష‌యంలో బీజేపీపై తెలుగుదేశం చేస్తున్న విమ‌ర్శ‌లు, నేరుగా ప్ర‌ధాని నరేంద్ర‌మోదీ పై టార్గెట్ గా నింద‌లు వేయడంతో, ఏపీ బీజేపీ నేత‌లు మ‌ద‌న‌విచారం ప‌డుతున్నారు.
 
ఇక తెలుగుదేశంతో క‌లిసి ఉంటే త‌మ‌కు ఉన్నా ఓటు బ్యాంకు కూడా ఉండ‌దు అని, గ‌త నెల‌రోజుల‌గా బీజేపీ ఫైన‌ల్ గా డెసిష‌న్ కు వ‌చ్చింది.. ఇక కేంద్రం నుంచి క‌టీఫ్ సంకేతాలు రాకుండానే మ‌నం ఏపీలో తెలుగుదేశానికి గుడ్ బై చెప్పాలి అని ఆలోచించుకున్నారు... అయితే కేంద్ర నాయ‌క‌త్వం కాస్త వేచిచూడ‌మ‌ని చెప్ప‌డంతో, గ‌త ప‌ది రోజులుగా ఏపీ బీజేపీ నేత‌లు స్ద‌బ్దుగా ఉన్నారు... ఇక తాజాగా బీజేపీ నాయ‌కులు తీసుకున్న నిర్ణ‌యం తెలుగుదేశానికి మ‌రింత కంటిలో జ‌ల్లెమాదిరి తయారైంది.
 
బీజేపీలో ఉన్న ఇద్ద‌రు మంత్రులు బ‌య‌ట‌కు రావ‌డానికి చూస్తున్నారు... తాజాగా విజ‌య‌వాడ‌లో జ‌రిగిన క‌మ‌లం పార్టీ నాయ‌కుల స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.. బీజేపీ పై విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటే తాము స‌హించేది లేదు అన్నారు క‌మ‌ల‌ద‌ళ‌నాయ‌కులు..ఇద్దరు మంత్రులు(మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్‌లు) రాజీనామాలు సమర్పించాలని తీర్మానించారు. కొద్ది రోజుల్లో జరుగనున్న బడ్జెట్‌ సమావేశాల్లో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందన్న నాయకులు.. ఈ నిర్ణయాల ఆమోదానికి అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తామని  తెలియ‌చేశారు మొత్తానికి ఏపీ బీజేపీ నిర్ణ‌యం తెలుగుదేశానికి షాక్ లాంటిదే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.