ఎల్లోమీడియా పై లీగ‌ల్ యాక్ష‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-16 16:54:47

ఎల్లోమీడియా పై లీగ‌ల్ యాక్ష‌న్

పీఏసీ చైర్మ‌న్ బుగ్గ‌న రాజేంద్ర‌నాధ్ రెడ్డి బీజేపీ నేత‌ల‌ను క‌లిశారు అని తెలుగుదేశం నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.. ఇక ఆయన్ని బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తీసుకువెళ్లారు అనే వ్యాఖ్య‌లు చేస్తున్నారు తెలుగుదేశం నాయ‌కులు...బుగ్గనను బీజేపీ నేతలవద్దకు తీసుకెళ్లారనే ఆరోపణలపై ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సవాల్ చేశారు.
 
ఈ వ్యాఖ్య‌ల‌ను బీజేపీ ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు..ఎవ‌రు కుట్ర రాజ‌కీయాలు చేస్తున్నారో తెలుస్తోంద‌ని  ఆయ‌న తెలియ‌చేశారు..ఢిల్లీలోని ఏపీ భవన్‌ ప్రభుత్వ అతిథి గృహం. ఇక్క‌డ ప్రజాప్రతినిధులు తారసపడడం, మాట్లాడుకోవడం సహజం.
 
అలాగే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇక్కడ కలిశారు. ఇద్దరం కలిసి పక్కనే ఉన్న రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేశాం. ఇందులో రహస్యం ఏముంది? కానీ మీరు చిలువలు పలువలు చేసి.. అబద్ధాలు, అవాస్తవాల మీద బతుకుతున్నారు. బుగ్గనని అమిత్‌షా వద్దకు గానీ, రామ్‌మాధవ్‌ వద్దకు గానీ తీసుకెళ్లినట్టు నిరూపించండి. నేను సవాలు చేస్తున్నా. దేనికైనా సిద్ధంగా ఉన్నా. నా చాలెంజ్‌ స్వీకరిస్తారో లేదో చెప్పాలి అని అన్నారు.
 
ఇక దీనిపై ఎల్లో మీడియా కుట్ర చేస్తోంద‌ని దానిపై లీగ‌ల్ చ‌ర్య‌లు తీసుకుంటాము అని అన్నారు..ప‌బ్లిక్‌ అకౌంట్‌ కమిటీలో చైర్మనే కాదు.. సభ్యులు కూడా ఉంటారు. మా పార్టీ నేత విష్ణుకుమార్‌రాజు దాంట్లో సభ్యుడు. కాగితాలు కావాలంటే ఆయన తెచ్చుకోలేరా? అని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు... వాస్తవాలను పక్కదారి పట్టించి మీరు చేసే ప్రయత్నాలను ఖండిస్తున్నా... దీనిపై వాస్త‌వాలు తాను నిరూపిస్తా కావాలంటే మంత్రి లోకేష్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై స్పందించాలి అని ఆయ‌న స‌వాల్ చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.