జ‌న‌సేన‌లోకి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

janasena and bjp
Updated:  2018-10-13 12:50:21

జ‌న‌సేన‌లోకి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే

2014లో హోరాహోరీగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో అక‌స్మాత్తుగా బీజేపీ త‌ర‌పున తెర‌పైకి వ‌చ్చిన నేత ఆకుల స‌త్య‌నారాయ‌ణ. వైద్యుడుగా రాజ‌మండ్రి న‌గ‌రంలో మంచి గుర్తిపు తెచ్చుకు ఈయ‌నకు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యే వ‌ర‌కు రాజ‌కీయంగా గుర్తిపు లేదు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా బీజేసీ అభ్య‌ర్థిగా పోటీ చేసి రాజ‌మండ్రి అర్భ‌న్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు ఆకుల‌. ప్ర‌స్తుత ఎమ్మెల్సీ పార్టీ సీనియ‌ర్ నేత సోము వీర్రాజుతో ఆకుల‌కు మొద‌ట్లోనే విభేదాలు రావ‌డంతో త‌న కోట‌రీని ఏర్పాటు చేసుకుని పాల‌న కొన‌సాగించారు రాజమండ్రిలో. బీజేపీ బ‌లం అంతంత మాగ్రంగా ఉన్నా ఎమ్మెల్యే ఆకుల ఎమ్మెల్సీ వీర్రాజుల వ‌ర్గాలు రెండు కోట‌రీలుగా కొన‌సాగాయి.
 
అంతేకాదు ఏ కార్య‌క్ర‌మాన్ని అయినా విడివిడిగా నిర్వ‌హించ‌డం మొద‌లు పెట్టారు. కాకినాడ‌కు చెందిన ప‌లువురు బీజేపీ నేత‌లు ఆకులకు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ‌గా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేత‌లంతా వీర్రాజు వెంటన‌డిచారు. దీంతో త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు మోడీ కార్య‌క్ర‌మాల‌ను విసృతంగా ప్ర‌చారం చెయ్య‌డం స్వ‌చ్చ‌ భార‌త్ కార్య‌క్రమాన్నివినూత్నంగా నిర్వ‌హించే ప్ర‌య‌త్నం చేసినా పెద్ద‌గా అవి గుర్తింపు పొంద‌లేక పోయియి. 
 
బీజేపీకి చెందిన రెండువ‌ర్గాలు అనేక‌సార్లు పార్టీ హైక‌మాండ్ కు ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదులు చేసుకున్నా అధిష్టానం మాత్రం ప‌ట్టించుకున్న ద