పార్టీ మార‌డం? అక్క‌డ నుంచే పోటీ చేస్తా?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-11 17:49:43

పార్టీ మార‌డం? అక్క‌డ నుంచే పోటీ చేస్తా?

ఎప్ప‌టి నుంచో వార్త‌లు వినిపిస్తున్నాయి... ఆయ‌న  పార్టీ మార‌తారు పార్టీలో ఆయ‌న ఉండ‌రు అంటూ? ఆయ‌నే  బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. ఇంకా ఆయ‌న పై అనేక వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి... అయితే అనేక సార్లు ఆయ‌న కామెంట్ల‌కు ఈ విమ‌ర్శ‌ల‌ను కొట్టిపారేశారు.. తాను పార్టీ మార‌ను త‌న‌కు అవ‌కాశం ఇచ్చిన బీజేపీతోనే తాను ఉంటాను అని తెలియ‌చేశారు. ఇక  విశాఖ ఉత్తరంలో బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా  విష్ణుకుమార్ రాజు ప్ర‌జ‌ల్లో మంచి పేరు తెచ్చుకున్నారు..
 
ముఖ్యంగా విశాఖ ఉద్యోగులు విద్యావేత్త‌లు ఉన్న ప్రాంతం.. ఇక్క‌డ బీజేపీ ఎంపీ సీటు కూడా గెలుచుకుంది. అందుకే బీజేపీ ఇక్క‌డ బ‌లంగా ఉన్నాము అని చెప్పే ప్రాంతం, అయితే న‌ర‌సాపురం మాత్రం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవ‌డం మోదీ చ‌రిష్మా ప‌వ‌న్ క‌లిసి రావ‌డంతో గోక‌రాజు గంగ‌రాజు విజ‌యం సాధించారు ఎంపీగా..
 
అయితే వైసీపీ బీజేపీకి ద‌గ్గ‌ర అవుతుంది అని అనేక విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటారు తెలుగుదేశం నాయ‌కులు.. మ‌రీ ముఖ్యంగా వైసీపీ కి ఈయ‌న ఎప్పుడూ స‌పోర్ట్ అంటూ తెలుగుదేశం నాయ‌కులు ఆయ‌న పై   విమ‌ర్శ‌లు చేయ‌డం స‌ర్వ‌త్రా అంతా తెలిసిందే.... అయితే జ‌గ‌న్ పై ఎటువంటి కామెంట్లు ఎందుకు విష్ణుకుమార్ రాజు చేయ‌రు అని ఓ బాధ‌తో తెలుగుదేశం మద‌న ప‌డుతూ ఉంటుంది... అయితే ఇక్క‌డ గంటా-  అయ్య‌న్న‌పాత్రుడికి కూడా మ‌ధ్య పొస‌గదు ఈ  తెలుగుదేశంతో త‌న‌కు ఎందుకు అని రాజుగారు దూరంగానే ఉంటారు.
 
ఇక పార్టీ మారుతున్నారు మీ సేవ‌లు వైసీపీకి కావాలి అని వారు కోరుతున్నార‌ట అని కొంద‌రు ప్ర‌శ్నించారు . దీనికి ఆయ‌న స‌మాధానం ఇచ్చారు..తాను పార్టీ మార‌నని పార్టీ ఆదేశిస్తే తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ ఇక్క‌డ నుంచే విశాఖ ఉత్త‌రం నుంచే పోటీ చేస్తాను అని తెలియ‌చేశారు. ఇక బీజేపీ వైసీపీతో కాని జ‌న‌సేన‌తో కాని పొత్తు పెట్టుకునే ఆలోచ‌న‌లో లేదు అని ఆయ‌న తెలియ‌చేశారు.
 
భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందో తెలియ‌దు అన్న విధంగా ఆయ‌న తెలియ‌చేశారు.. ఒక‌వేళ ఏ పార్టీతో పొత్తుపెట్టుకున్నా ఆయ‌న‌కు మాత్రం సీటు ప‌క్కా పొత్తుపెట్టుకున్న పార్టీ సైడ్ అవ్వాల్సిందే అనేది అక్క‌డ ఆయ‌న కేడ‌ర్ చెప్పే మాట‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.