సోము వీర్రాజు సంచ‌ల‌న స‌వాల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

somu veraju and chandrababu naidu
Updated:  2018-05-15 04:51:35

సోము వీర్రాజు సంచ‌ల‌న స‌వాల్

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు 2014 ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఏపీలో ప్ర‌త్యేక హోదా అంశాన్ని ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెర‌లేపారు.దీంతో టీడీపీ అధిష్ఠానం వెంట‌నే బీజేపీ మిత్రప‌క్షం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై  ప్ర‌త్యేక హోదా విష‌యంలో చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్న సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే. 
 
ఇక వారు చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు త‌న‌ధైన శైలిలో కౌంటర్ ఇస్తూ తెలుగు దేశం పార్టీ నాయ‌కుల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇక తాజాగా ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ, మ‌రో సారి చంద్ర‌బాబు నాయుడికి సంచ‌ల‌న స‌వాల్ విసిరారు సోము వీర్రాజు.
 
గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు త‌న అనుచ‌రుతో క‌ర్ణాట‌క‌లో బీజేపీకి ఓటు వేయ‌కండి అంటూ ప్ర‌చారం చేయించార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అయితే వారి ప్ర‌చారాన్ని క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు తిప్పికొట్టి బీజేపీకి అధికార పీఠాన్ని ద‌క్కించార‌ని  ఆయ‌న తెలిపారు. బీజేపీలో నితీ, నిజాయితీ, అభివృద్ధి ఉంది కాబట్టే అన్ని రాష్ట్రల ప్రజలు బీజేపీని కోరుకుంటున్నాయని సోము వీర్రాజు అన్నారు. చంద్ర‌బాబు బీజేపీ పై ఎన్ని కుట్ర రాజ‌కీయాలు చేసినా కానీ ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు త‌మ‌కు క‌చ్చితంగా ఉంటుంద‌ని అన్నారు.
 
అయితే ఇప్పుడు క‌ర్ణాట‌క‌లో బీజేపీ అఖండ విజ‌యం సాధించింద‌ని ఇప్పుడ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని ఆయ‌స స‌వాల్ విసిరారు. 2019 సార్వ‌త్రిక  ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోతాద‌ని సోము వీర్రాజు అన్నారు. అలాగే ప్రత్యేక హోదా విష‌యంలో చంద్ర‌బాబు రెండు నాలుక‌ల ధోర‌ణి లాగ మాట్లాడి ఇప్పుడు బీజేపీతో క‌టిఫ్ చెప్పి ప్ర‌త్యేక హోదా కావాలంటూ దొంగ దీక్ష‌లు చేస్తున్నారని ఆయ‌న మండిప‌డ్డారు.
 
ఈ దీక్ష‌లో హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్ర‌ధాని మోడీని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బాబు నవ్వుతారా అని ఆయ‌న మండిప‌డ్డారు. అలాగే మొన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారం ముగించుకుని ద‌ర్శ‌న నిమిత్తం తిరుమల చేరుకుంటే చంద్ర‌బాబు త‌మ పార్టీ నేత‌ల‌తో దాడి చేస్తారా అని ఆరోపించారు.  అయితే ఈ  కుట్ర‌లన్ని చంద్ర‌బాబు ఆదీనంలో జ‌రిగితే త‌మ‌కు ఎలాంటి సంబ‌ధం లేద‌ని టీడీపీ నాయ‌కులు చెప్ప‌డం, సిగ్గుచేట‌ని సోమువీర్రాజు విమర్శించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.