పొత్తుపై సోము క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-24 15:25:10

పొత్తుపై సోము క్లారిటీ

తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో మొద‌టిగా 2014 లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు. బీజేపీతో పొత్తుపెట్టుకుని వారి అండ‌తో అధికారంలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌ అధికార పీఠాన్ని ద‌క్కించుకున్నప్ప‌టి నుంచి సుమారు నాలుగు సంవ‌త్స‌రాల‌పాటు బీజేపీతో మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఏపీ ప్ర‌తిప‌క్షాలు విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదా ప్ర‌స్తావ‌న తెర‌పైకి తీసుకురావ‌డంతో చంద్ర‌బాబు బీజేపీకి క‌టీఫ్ చెప్పారు. 
 
ఇక ఎప్పుడైతే చంద్ర‌బాబు బీజేపీ మిత్ర‌ప‌క్షానికి గుడ్ బై చెప్పారో అప్ప‌టి నుంచి చంద్ర‌బాబు పై ఏపీ బీజేపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తునే ఉన్నారు. త‌మతో మిత్ర‌ప‌క్షంగా ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు ఇక్క‌సారి కూడా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాల‌ని అడ‌గ‌లేద‌ని,  అయితే త‌మ‌కు ప్ర‌త్యేక హోదా బ‌దులు ప్ర‌త్యేక ప్యాకేజీ కావాల‌ని అన్నార‌ని మీడియా స‌మావేశంలో బీజేపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. ఇలా నాలుగు సంవ‌త్స‌రాల‌పాటు చంద్ర‌బాబు విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశాల విష‌యంలో మాట మార్చుతున్నందువ‌ల్ల కేంద్రం ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టించ‌లేద‌ని బీజేపీ నాయ‌కులు అంటున్నారు. 
 
ఇక ఇప్పుడు సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న త‌రుణంలో చంద్ర‌బాబు మ‌రో నాట‌కానికి తెర లేపుతున్నార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బీజేపీతో పొత్తు పెట్టునేందుకు రెడీ అవుతున్నార‌ని టీడీపీ నాయ‌కులు ప‌చ్చ మీడియాల‌లో ప్ర‌చారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విష‌యంపై అనేక సార్లు వైసీపీ అధినేతతో పాటు పార్టీ శ్రేణులు కొట్టిపారేస్తున్నప్పటికీ టీడీపీ మాత్రం విమర్శలు చేస్తూనే ఉంది.
 
ఇక‌ ఈ వ్యవహారంపై తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ, ఫైర్ బ్రాండ్ సోమువీర్రాజు స్పందించారు. తాము 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీతో పొత్తుపెట్టుకోమ‌ని క్లారిటీ ఇచ్చారు. కొద్ది రోజుల నుంచి టీడీపీ నాయ‌క‌లు వైసీపీతో  బీజేపీ పొత్తు పెట్టుకుందని పదేపదే చెప్పడం ఏంని ప్ర‌శ్నించారు. అందుకే తాను ఎప్పుడు టీడీపీ ఒక డ్రామాల పార్టీ అని అంటాన‌ని అన్నారు. మీడియా స‌మావేశంలో టీడీపీ నాయ‌కులు ఒక్కొక్క‌రు ఒక‌లాగా మాట్లాడుతార‌ని అందుకే తాను ఈ పేరు పెట్టాన‌ని అన్నారు. 
 
మోదీని జగన్ కలిసినంత మాత్రాన పొత్తుకోసమేనని ఎలా అనుకుంటారని సోమువీర్రాజు మండిప‌డ్డారు. చంద్రబాబు రాష్ట్రంలో పరిపాలన చేయకుండా వ్యాపారం చేస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. అందుకనే ఆయన కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవంలో రాహుల్ గాంధీ భుజాలు తడుతున్నారని తీవ్రస్థాయిలో సోమువీర్రాజు ధ్వజమెత్తారు.

షేర్ :

Comments

1 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.