జ‌గ‌న్ తో మాకు మా పార్టీకి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-05 04:28:15

జ‌గ‌న్ తో మాకు మా పార్టీకి

భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌ల‌కు, తెలుగుదేశం పార్టీ నేత‌ల‌కు మ‌ధ్య మాట‌ల వివాదం కొన‌సాగుతూనే ఉంది. ముఖ్యంగా  బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌లు భ‌గ్గుమంటున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న,  సోము వీర్రాజుపై ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. 
 
సీఎం మంచిత‌నాన్ని చేత‌గాని త‌నంగా భావిస్తున్నార‌ని, జ‌గ‌న్ ను సోము వీర్రాజు ఎందుకు విమ‌ర్శించ‌డం లేద‌ని, టీడీపీ ఇచ్చిన  ఎమ్మెల్సీని ఎందుకు తీసుకున్నారంటూ సోము వీర్రాజును ప్ర‌శ్నించారు బుద్దా వెంక‌న్న‌. చంద్ర‌బాబు ను విమ‌ర్శించే అర్హ‌త  లేద‌ని,  సోము ఎంజెండా బీజేపీదా..లేక వైసీపీదా....జ‌గ‌న్ తో జరిగిన ర‌హ‌స్య  ఒప్పందం ఏంటో చెప్పండి అని బుద్దా వెంక‌న్న ప్ర‌శ్నించారు. 
 
ఇందుకు సోము వీర్రాజు  స్పందిస్తూ.... నిధుల‌కు జ‌మా ఖ‌ర్చు చెప్పే పార్టీ ఒక్క‌టే, నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది టీడీపీ కాదు బీజేపీ అని అన్నారు. మిత్ర ప‌క్షంలో ఒప్పందం ప్ర‌కారమే నాకు ఎమ్మెల్సీ వ‌చ్చింద‌ని అన్నారు. జ‌గ‌న్ తో మాకు, మా పార్టీకి ఎలాంటి సంబంధం లేద‌ని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డంపై టీడీపీ నేత‌లు ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని సోము వీర్రాజు అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.