టీడీపీలో వారు డ‌మ్మీలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

bjp mlc somu verraju
Updated:  2018-03-30 06:40:59

టీడీపీలో వారు డ‌మ్మీలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక‌హోదా,విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ అమ‌లు విష‌యంలో టీడీపీ-బీజేపీ మ‌ధ్య ఉన్న మైత్రి బంధానికి శుభంకార్డు ప‌డిన విష‌యం తెలిసిందే. నాలుగేళ్లు క‌లిసి ప‌రిపాల‌న చేసిన ఇరు పార్టీలు ప్ర‌స్తుతం ఒక‌రి పై ఒక‌రు జోరుగా విమ‌ర్శ‌లు చేసుకునేవ‌ర‌కూ వ‌చ్చింది పొలిటిక‌ల్ స్క్రీన్ ప్లే... రాజ‌కీయ కార‌ణాల వ‌ల్ల విడిపోయిన ఈ రెండు పార్టీలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డానికి  వ్యూహాలు ర‌చించుకుంటున్నాయి.అందులో భాగంగానే బీజేపీ రాయ‌ల‌సీమ డిక్ల‌రేష‌న్ తెరమీద‌కు  తీసుకోచ్చింది.
 
దీని పై లోతుగా ప‌రిశీల‌న చేయ‌డానికి బీజేపీ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు క‌ర్నూల్ జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో భయంకరమైన అవినీతి జరుగుతోందని అన్నారు. ప్రభుత్వాస్పత్రిలో 90 యంత్రాలు పని చేయడం లేద‌ని అన్నారు. ఆ యంత్రాలు పని చేయకపోయినా సీఎం డాష్ బొర్డులో పనిచేస్తున్నట్లు నమోదు చేశార‌ని తెలిపారు.
 
టీబీఎస్‌ సంస్థ పరికరాల మెయింటెనెన్స్ బాధ్యతలు టెండర్ ద్వారా తీసుకుంది. టీబీఎస్‌కు ఎక్కడా లేని విదంగా రూ.103 కోట్లు మొబిలైజేషన్‌ ద్వారా, బిల్లుల రూపంలో రూ. 45 కోట్లు చెల్లించారని సోము వీర్రాజు తెలిపారు. ఆ సంస్థ టీడీపీకి చెందిన‌ ఓ మంత్రి గారి బంధువుది కావడంతో ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నార‌ని అన్నారు. టీబీఎస్ సంస్థ‌కు ఇచ్చిన‌ కాంట్రాక్టును వెంట‌నే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే టాయిలెట్స్ నిర్మాణం, ఎన్ఆర్‌జీఎస్‌లో జ‌రిగిన‌ అవినీతిని వెలికితీస్తామ‌ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు.
 
రాష్ట్రంలో తండ్రీకొడుకులు మాత్ర‌మే పాలన చేస్తున్నారని, మంత్రులంతా డమ్మీలుగా మారారని విమర్శించారు. కేఈ, చిన్నరాజప్పలు కేవలం పేరుకే ఉప ముఖ్యమంత్రులని, వారికి ఎలాంటి అధికారాల్లేవని అన్నారు. గతంలో ప్ర‌త్యేక ప్యాకేజీని స్వీక‌రించి ప్రధానిని పోగిడిన చంద్రబాబు ప్ర‌స్తుతం ప్ర‌త్యేక‌హోదా కోసం మోదీని విమ‌ర్శించ‌డం దారుణం అని అన్నారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు ఎందుకు లాలూచీ పడుతున్నారని, సోనియాతో గాంధీతో ఎందుకు రహస్య మంతనాలు జరుపుతున్నారని మండిపడ్డారు.
 
అయితే ఇక్క‌డ సోము వీర్రాజు ఓ విష‌యాన్ని మ‌ర్చిపోయార‌ని అంటున్నారు తెలుగుదేశం నాయ‌కులు... ఆ మంత్రిత్వ శాఖ ఇప్ప‌టి వ‌ర‌కూ మీ బీజేపీ ఎమ్మెల్యే మిత్ర‌బంధం మంత్రి కామినేని చేశారు అని సెల‌విస్తున్నారు త‌మ్ముళ్లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.