సోము వీర్రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-04 01:44:20

సోము వీర్రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ పై  ఏపీలో టీడీపీ నేత‌లు గుర్రుగా ఉన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. మ‌రోవైపు బీజేపీ నేత‌లు మాత్రం  బ‌డ్జెట్ ను స‌మ‌ర్ధిస్తూ త‌మ‌దైన శైలిలో టీడీపీ పై విమ‌ర్శ‌లు  చేస్తున్నారు. 
 
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఎల్ ఈ డీ బ‌ల్బులు మోదీ ఇస్తే.. దానిపై చంద్ర‌బాబు ఫోటోలు ఉంటాయి. ఏపీకి కేంద్ర ప్ర‌భుత్వం  చేస్తున్న స‌హాయాల‌ను, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌ను ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయ‌డం లేదు. ఏపీకి రూ. 30 వేల కోట్లు ఉపాధీ హామీ ప‌థ‌కం ద్వారా ఇచ్చామ‌ని సోము వీర్రాజు తెలిపారు,.
 
ఏపీలో ఎన్ని అభివృద్ది కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నా....అందులో  మోదీ బొమ్మ క‌నిపించ‌కుండా చంద్ర‌బాబు కుట్ర చేస్తున్నారంటూ ఆయ‌న ఎద్దేవా చేశారు. ఇక,  మ‌హానుభావుడు పార్టీని స్ధాపిస్తే.. ఆయ‌న్ను భూ స్ధాపితం చేసి అధికారంలోకి వ‌చ్చారు. రెండు ఎక‌రాల రైతు అంటున్న మీకు ల‌క్ష‌ల కోట్ల ఆస్తులు ఎలా వ‌చ్చాయంటూ చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు సోము వీర్రాజు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.