బాబు మిత్రుడు ఫైర్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-04 15:01:07

బాబు మిత్రుడు ఫైర్ ?

త‌న రాజ‌కీయం తెర‌చిన పుస్త‌కం త‌న జీవితం బైండింగ్ పుస్త‌కం అని సీఎం చంద్ర‌బాబు ఎప్పుడూ చెబుతూ ఉంటారు.. అయితే తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత రాజ‌కీయంగా తెరిచిన పుస్త‌కాలు కాగితాలు అన్నింటిపైనా చ‌ర్చించుకుంటున్నారు నాయకులు.... కేంద్ర‌మంత్రుల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌డం ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు రావ‌డం అన్నీ అలా జ‌రిగిపోయాయి అన‌డానికి లేదు, నాలుగు సంవ‌త్సరాలు క‌లిసి రాజకీయ ఓడ‌లో ప్రయాణం చేసి బీజేపీ నుంచి బ‌య‌ట‌కు దూకారు..
 
ఏపీకి ప్ర‌త్యేక హూదా సంజీవ‌నా ప్యాకేజీ బాగుంది, ఆల్ ఆర్ ప్యాకేజ్ కి స‌పోర్ట్ విల్ హ్యాపీ అన్నారు... ఆ మాట మీద కూడా లేకుండా, నౌ ప్ర‌త్యేక హూదా ఇజ్ రియ‌ల్లీ సంజీవ‌ని, వాట్ అయామ్ సేయింగ్ ఇజ్ క‌రెక్ట్ అన్నారు.. ఇక అంద‌రూ మ‌ళ్లీ బాబు యూట‌ర్న్ తీసుకుని మ‌ళ్లీ   ప్యాకేజీ బెట‌ర్ అంటారేమో అని ఇంకా డైల‌మాలో ఉన్నారు.
 
ఇక ఏపీ బీజేపీలో ప్ర‌క్షాళ‌న జ‌ర‌గాలి, బాబుకు అనుకూలంగా ఉండే నాయ‌కుల‌కు పెద్ద పెద్ద ప‌ద‌వులు కాకుండా చోటా ప‌ద‌వులు ఇచ్చి క్రియాశీల‌క ప‌ద‌వుల నుంచి త‌ప్పించాలి అని ఏ నాటి నుంచో వినిపిస్తున్న‌వాద‌న... అందుకే ఏపీపై ఆచితూచి అడుగులేస్తోంది బీజేపీ. అయితే ఏపీ బీజేపీలో కామినేని కూడా మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశాక ఏకంగా తెలుగుదేశం పంచ‌న చేరుతారు అని అనుకున్నారు, కాని అది జ‌ర‌గ‌లేదు. ఇక కంభంపాటి కూడా బాబుకు స‌పోర్ట్ ర్ అని కొంత మంది అంటారు.. ఆయ‌న కూడా  బాబు దిల్లీ ప‌ర్య‌ట‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు, దీంతో రాజ‌కీయం మ‌రింత ర‌స‌వ‌త్తంగా మారింది.
 
!! ఓసారి కంభంపాటి మాట‌లు ప‌రిశీలిస్తే !!
దేశ రాజధానిలో సీఎం చంద్రబాబు పర్యటనపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. టీడీపీ పరపతి పూర్తిగా క్షీణించినట్లు తన ఢిల్లీ పర్యటన ద్వారా చంద్రబాబే బహిర్గతం చేసుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు విమ‌ర్శించారు,రాజకీయంగా వైఎస్సార్‌సీపీకి, బీజేపీకీ ఎలాంటి సంబంధమూ లేదని కంభంపాటి హరిబాబు స్పష్టం చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు బీజేపీ దగ్గరవుతోంది కాబట్టి తాము ఎన్డీఏ నుంచి విడిపోయామని టీడీపీ పేర్కొనటం అసంబద్ధమైన ఆరోపణ అన్నారు... టీడీపీ వైసీపీ ఆడిన రాజ‌కీయం అంతే అని ఆయ‌న అన్నారు.. బీజేపీ, టీడీపీ విడిపోవాలని పెట్టుకున్న లక్ష్య సాధనలో వైఎస్సార్‌ సీపీ విజయం సాధించిందన్నారు. 
 
టీడీపీకి ఎజెండాను నిర్దేశించింది వైఎస్సార్‌సీపీనే అని కంభంపాటి పేర్కొన్నారు.మీ (టీడీపీ) మంత్రులు కేంద్రం నుంచి వైదొలగాలన్న డిమాండ్‌కు అనుగుణంగా మీరు రాజీనామా చేశారు. మంత్రులు రాజీనామా చేయడమే కాదు ఎన్డీఏ నుంచి బయటకు రావాలని ఆ పార్టీ డిమాండ్‌ చేసింది. మీరు బయటకు వచ్చారు. మోదీపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం మీరు పెడతారా లేదా అని వైఎస్సార్‌సీపీ టీడీపీ మెడపై కత్తిపెట్టింది. టీడీపీ.. వైఎస్సార్‌సీపీని అనుసరించింది.
 
వైఎస్సార్‌సీపీ పన్నిన ఉచ్చులో టీడీపీ పడింది. ప్రధాని తన కార్యాలయాన్ని వేరొకరు వాడుకునేందుకు ఇస్తారని భావిస్తే అంతకంటే అమాయకులు ఎవరూ ఉండరని విమ‌ర్శ‌లు చేశారు తెలుగుదేశం పై కంభంపాటి.మొత్తానికి హ‌రిబాబు నోట బాబుపై పెద్ద మాట అని సోష‌ల్ మీడియాలోనే కాదు బ‌య‌ట కూడా జ‌నం చ‌ర్చించుకుంటున్నారు... ఇలా అయితే బీజేపీ ఏపీలో కాస్త కోలుకోవ‌చ్చు అంటున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.