ఏపీ-టీఎస్ లో బీజేపీ స‌రికొత్త ప్లాన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-16 14:21:25

ఏపీ-టీఎస్ లో బీజేపీ స‌రికొత్త ప్లాన్

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి రెండు రాష్ట్రాల నుంచి ఎక్కువ ఎంపీ సీట్ల‌ను గెలుచుకునే ల‌క్ష్యంగా చేసుకుని భార‌తీయ జ‌న‌తాపార్టీ నాయ‌కులు ప‌నిచేస్తున్నారా అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. 2009లో పార్టీ గెలిచిన సీట్ల‌ను బీజేపీ నాయ‌కులు నిల‌బెట్టుకోవ‌డ‌మే కాదు 2014 ఎన్నిక‌ల్లో ఓడిపోయిన స్థానాల్లో కూడా గెలుపే ల‌క్ష్యంగా పార్టీ జాతీయ‌ నాయ‌క‌త్వం రాష్ట్రనాయ‌క‌త్వానికి దిశా నిర్ధేశం చేస్తోంద‌ట‌. దీంతో రెండు రాష్ట్రాల‌లో రాష్ట్ర అధ్య‌క్షులు నాయ‌కత్వం వ‌హిస్తూ అదే దిశ‌గా ప‌నిచేస్తున్నారు. ప్ర‌తీ ఎంపీ స్థానాన్ని కూడా ఒక క్ల‌స్ట‌ర్ గా తీసుకుని స‌మీక్ష చేసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌.
 
అంతేకాదు పార్టీ సంస్థాగ‌త బ‌లం ఏ మేర‌కు ఉంద‌నే దానిపై క్లారిటీ తీసుకుని అక్క‌డ ఎలాంటి వ్య‌క్తిని బ‌రిలోకి దించాల‌న్న దానిపై ఓ క్లారిటీ ఇవ్వాల‌ని చేస్తున్నారు రాష్ట్ర బీజేపీ పెద్ద‌లు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ ఇప్ప‌టికే జ‌న‌చైత‌న్య యాత్ర ద్వారా ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు. మూడువారాల‌కు పాటు సాగుతున్న ఈ యాత్ర‌లో పార్టీ శ్రేణుల‌కు స‌రికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అనుకున్న దానికంటే ఎక్కువ‌గా ఈ యాత్ర‌కు జ‌నాలు కార్య‌క‌ర్త‌లు హాజ‌రు అవుతుండ‌టంతో బీజేపీ సీనియ‌ర్లు డ‌బుల్ ఎన‌ర్జీతో ముందుకు సాగుతున్నారు. బీజేపీ అస‌లు పోటీ కాద‌ని అనుకున్న‌వారికి ఈ యాత్ర స‌మాధానం ఇస్తుంద‌ని క‌మ‌ల‌నాదులు ఆశాభావంతో ఉన్నారు. 
 
తెలంగాణ‌ రాష్ట్రం త‌మ చేతిలో బందీ అయిందంటూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై ఘాటుగా వ్యాఖ్య‌లు చేస్తూనే తాము టీఆర్ ఎస్ తో ఎలాంటి లోపాయిక ఒప్పందాలు లేద‌న్న క్లారిటీ ప్ర‌జ‌ల‌కు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు బీజేపీ నాయ‌కులు. అయితే గ‌తంలో కంటే భిన్నంగా స్థానికి స‌మ‌స్య‌లు, అధికార పార్టీ నేత‌ల తీరును ఎండ‌గ‌డుతూ యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. ఇక మ‌రోవైపు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టినుంచి క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ కూడా జిల్లాల ప‌ర్య‌ట‌న పేరుతో కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇక ఈ ప‌ర్య‌ట‌న‌లో సంద‌ర్భంగా టీడీపీ నేత‌లు చేస్తున్న దాడుల‌ను స‌మ‌ర్ధంగా తిప్పికొడుతున్నారు. 
 
తాము అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇవ్వ‌లేక దాడుత‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అవినీతిని క‌ప్పి పుచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని బీజేపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. అమిత్ షా, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, సోము వీర్రాజుల మీద దాడి, కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్ట్ చేయ‌డం, త‌ప్పుడు కేసులు పెట్టి వేదిస్తున్నారంటూ కార్య‌క‌ర్త‌ల‌కు విశ్వాసాన్ని పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు బీజేపీ నాయ‌కులు. ఇక టీడీపీతో బీజేపీ క‌టీఫ్ అయిన త‌ర్వాత బీజేపీ నాయ‌కులు ఒంటికాలుమీద లేస్తున్నారు. మ‌రి రెండు రాష్ట్రాల బీజేపీ నాయ‌కుల ప‌ర్య‌ట‌న‌లు కృషి పార్టీ ఎదుగుద‌ల‌తో పాటు పార్టీ గెలుపుకు ఏమాత్రం దోహ‌ద‌ప‌డుతాయే వేచి చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.