టీడీపీపై బీజేపీ దండయాత్ర...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu and narendra modi image
Updated:  2018-03-09 05:48:48

టీడీపీపై బీజేపీ దండయాత్ర...

2004 ఎన్నికల్లో మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, బీజేపీలు, కేంద్రలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీలు ఘోర పరాజయాన్ని చవిచూశాయి...ఆ ఓటమి తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బీజేపీ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు...ఆ వ్యాఖ్యలు ఏంటంటే "ఇక ఈ జన్మలో బీజేపీతో పొత్తుపెట్టుకోము, వాళ్ళతో పొత్తుపెట్టుకొని మా కాళ్ల‌ను మేమే నరుకున్నాము, వాళ్ల‌తో పొత్తు పెట్టుకున్నందుకు మమల్ని క్షమించండి అన్నారు.
 
టీడీపీ ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేసినా, 10 ఏళ్లపాటు ప్రతిపక్షపాత్ర పోషించి విసిగిపోయిన బీజేపీ ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని, అన్ని మర్చిపోయి 2014 ఎన్నికలలో టీడీపీతో దోస్తీ కట్టింది.. ఇక టీడీపీ కూడా ఏమి తక్కువ తినలేదు, ఆ సమయంలో మోడీకి ఉన్న క్రేజ్ ని ఉపయోగించుకొని అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీకి మిత్రపక్షమైంది...ఇలా ఎవరి స్వార్ధ రాజకీయాలకోసం వాళ్ళు, రాజకీయంగా లబ్ది పొందడానికి భాగస్వాములుగా మారారు 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో.
 
ఆ ఎన్నికలలో ఇరు పార్టీలు జయభేరి మోగించాయి.. అయితే బీజేపీ మాత్రం ఎవరూ  ఊహించని విధంగా, ఏ మిత్రపక్షాల మద్దతు అవసరం లేకుండా, భారీ  మెజార్టీతో విజయ ఢంకా మోగించింది. అప్పటి నుండే టీడీపీ పై బీజేపీ దండయాత్ర మొదలుపెట్టింది. ఆ దండయాత్రలో భాగంగానే చంద్రబాబు కుళ్ళు తెలివితేటలను గమనించిన బీజేపీ, మొదటి నుండే టీడీపీని దూరం పెడుతూ వచ్చింది... ఆ దూరం నాలుగేళ్లు గడవక ముందే ఇరు పార్టీల మధ్య వైరంగా మారింది.
 
ఆ దండయాత్రకు కొనసాగింపుగా బీజేపీ నాయకులు మిత్రపక్షమైన టీడీపీ పై , ఆ పార్టీ అధినాయకుడిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు.... దీంతో  2019 ఎన్నికలలో టీడీపీకి, బీజేపీ దూరమవుతుందనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. దీనికి మరింత బలం చేకూరేలా ఒక వ్యక్తిని నమ్మి 30 సంవత్సరాల పాటు మోసపోయాం, ఇక మోసపోయే ప్రసక్తే లేదు అని అమిత్ షా చేసిన వ్యాఖ్యలు మ‌ర‌వ‌లేనివే, ఈ మధ్య కాలంలో విజయవాడలో బీజేపీ నిర్వహించిన భారీ  బహిరంగ సభలో, బీజేపీ అభిమానులు "LEAVE టీడీపీ SAVE బీజేపీ" అనే నినాదంతో భారీ ఎత్తున ప్లకార్డులను ప్రదర్శించడం కూడా తెలిసిందే, ఈ మధ్య కాలంలో బీజేపీ నాయకులు టీడీపీ పైన ఎక్కువగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు..  అలాగే రాష్ట్రంలో  ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఎప్పటికప్పుడు టీడీపీ నాయకులపై, చంద్రబాబు పై విరుచుకుపడటం చూస్తూనే ఉన్నాం.
 
లోకులమాట : 
అవసరమైనప్పుడు కాళ్లు. లేనప్పుడు జుట్టు పట్టుకోవడం" టీడీపీ సిద్దాంతం...ఇప్పుడు అదే సిద్దాంతాన్ని బీజేపీ అనుసరించేసరికి పచ్చనేతలు అంతా తెల్లముఖం వేసుకున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

షేర్ :

Comments

1 Comment

  1. avuna ra jaffa. bjp ni support chestunavu ante.. nivu pedda jaffavi ra

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.