చంద్రబాబుకు సూటి ప్ర‌శ్న‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-01 15:51:15

చంద్రబాబుకు సూటి ప్ర‌శ్న‌

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో నిన్న తిరుప‌తిలో నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలపై ధర్మపోరాటం స‌భ‌ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే... అయితే ఈ స‌భ‌పై ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌తో పాటు బీజేపీ నాయ‌కులు కూడా విమ‌ర్శలు చేస్తున్నారు...
 
తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింద‌ని స‌భా ముఖంగా ప్ర‌చారం చేసుకునే చంద్ర‌బాబు ఇప్పుడు ధ‌ర్మ‌పోరాట దీక్ష‌కు డ‌బ్బులు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయో ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు వ్యాఖ్యానించారు.
 
విలాసవంత‌మైన పోరాటాలు ఖ‌రీదైన దీక్ష‌లు చంద్ర‌బాబు చేస్తున్నార‌ని, ఈ డ‌బ్బంతా  పోల‌వ‌రం ప్రాజెక్టులో చేసిన అవినీతి, పట్టిసీమలో సంపాదించిన‌దేనా అని నరసింహారావు ప్ర‌శ్నించారు... దీక్ష‌ల పేరు చెప్పి విచ్చ‌ల‌విడిగా చంద్ర‌బాబు ప్ర‌జా ధ‌నాన్ని ఖ‌ర్చు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు...మొన్న విజ‌యవాడ‌లో 30 కోట్లు ఖ‌ర్చు పెట్టి  ధ‌ర్మ‌పోరాట దీక్ష చేశార‌ని, మళ్లీ నిన్న తిరుప‌తిలో చేప‌ట్టిన‌ దీక్ష‌కు చంద్ర‌బాబు ఎంత ఖ‌ర్చు చేశారోన‌ని న‌ర‌సింహిరావు విమ‌ర్శించారు..  టీడీపీ నాయ‌కులు దీక్ష‌ల పేరు చెప్పి పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఢిల్లీలో ఆరోపించారు.
 
అయితే  దేశంలో ఏ రాష్ట్రానికి కేటాయించ‌ని నిధుల‌ను ఏపీకి కేటాయించార‌ని, వాటిని స‌రిగ్గా అమ‌లు చేయ‌డంలో చంద్ర‌బాబు విఫ‌లం అయ్యార‌ని జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు.... చంద్ర‌బాబు చేసేది దర్మ‌పోరాటం కాద‌ని ఇదంతా సార్వ‌త్రికి ఎన్నిలు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో అధికారిక ఆరాటం అని స్ప‌ష్టం చేశారు... అయితే ఆయ‌న ఎన్ని పోరాటాలు చేసినా కానీ 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మి మాత్రం ఖాయం అని వ్యాఖ్యానించారు.. ఈ ఓట‌మి భ‌యంతోనే చంద్ర‌బాబు ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.