నిజం చెప్పిన బీజేపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-16 05:09:42

నిజం చెప్పిన బీజేపీ

కేంద్ర బ‌డ్జెట్ లో త‌మ‌కు  అన్యాయం జ‌రిగిందంటూ తెలుగు రాష్ట్రాలు ఎన్డీఏ స‌ర్కార్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో ప్ర‌జ‌లు బీజేపీపై మ‌రింత గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్షాలు బీజేపీని ముందు మేం ఢీకొడ‌తామంటే..... మేం ఢీకొడ‌తామంటూ..... ప్ర‌క‌ట‌నలు ఇస్తున్నారు.  అయితే   ఏపీకి న్యాయం చేశామ‌ని, మున్ముందు ఇంకా చేస్తామ‌ని  బీజేపీ నేత‌లు బ‌ల్ల‌లు గుద్ది మ‌రీ చెబుతున్నారు. 
 
దీంతో ఇందులో నిజ‌మెంత అనే  విష‌యాన్ని  తెలుసుకునేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలో  జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ (జేఎఫ్ ఎఫ్‌ సీ)పేరుతో ఓ క‌మిటీ ఏర్పాటు అయింది. ఇందులో  సీనియ‌ర్ నాయ‌కులు, మేధావుల‌తో పాటు క‌మ్యునిస్ట్, కాంగ్రెస్ పార్టీ నేత‌లు కూడా ప‌ని చేసేందుకు సిద్ద‌మ‌య్యారు. 
 
ఇందు కోసం ఏర్పాటు చేసిన రెండు రోజ‌ల స‌మావేశంలో  భాగంగా కేంద్రం ఏపీకి ఇచ్చిన లెక్క‌లు చెప్పాల్సిందేన‌ని జేఎఫ్ ఎఫ్ సీ డిమాండ్ చేస్తోంది. ఈ క్ర‌మంలో బీజేపీ ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ వారి వాద‌న‌ను వినిపించింది.  కేంద్రం ఏపీకి ఎలాంటి అన్యాయం చేయ‌లేద‌ని, హోదా తో రాజ‌కీయాలు చేస్తున్నార‌ని, ప్యాకేజీతో ఏపీని ఆదుకుంటామ‌ని అంటున్నారు బీజేపీ నేత‌లు.
 
గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, టీడీపీ పార్టీలు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అభివృద్దిని హైద‌రాబాద్ కే ప‌రిమితం చేసి త‌ప్పుచేశార‌ని బీజేపీ విమ‌ర్శించింది. అప్పుడే అభివృద్దిని వికేంద్రీక‌ర‌ణ చేసుంటే ఇప్పుడు ఏపీకి ఈ పరిస్ధితి వ‌చ్చేది కాద‌ని బీజేపీ అభిప్రాయ‌ప‌డింది. 
 
బీజేపీ చెప్పినవాటిలో ఇది మాత్ర‌మే నిజం అని చెప్పాలి. ఇప్పుడు కూడా ఏపీలో టీడీపీ అభివృద్దిని అమ‌రావ‌తి ప్రాంతానికే ప‌రిమితం చేస్తున్నారు.  ఇప్పుడు కూడా అదే  పొర‌పాటును  పునరావృతం చేస్తే రానున్న రోజుల్లో  మ‌రో స‌మ‌స్య ఉద్భ‌వించ‌డం మాత్రం ఖాయం. అందుకే ఇప్పుడైనా మారండీ ప్లీజ్ అంటూ సామాన్యులు  ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు. 
 
ఇక కేంద్ర హోదా విష‌యంలో మాత్రం ఏపీని మోసం చేసింద‌నే చెప్పాలి. ఇవ్వడానికి వీలుకాన‌ప్పుడు ఎన్నిక‌ల ముందు ఖ‌చ్చితంగా హోదా ఇచ్చి తీరుతామ‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డం  ఎందుకు..... విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అంశాల‌ను అమ‌లు చేసేందుకు అంత అల‌స‌త్వం ఎందుకు...... ప్ర‌జ‌లంటే నిజంగానే జాతీయ పార్టీల‌కు అంత లోకువ‌గా మారారా... ఇలాగే కొన‌సాగితే జాతీయ పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో ఉనికిని కోల్పోవాల్సి ఉంటుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.