చంద్ర‌బాబు కు బీజేపీ అదిపోయే అవార్డ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-26 15:10:12

చంద్ర‌బాబు కు బీజేపీ అదిపోయే అవార్డ్

బీజేపీ సీనియ‌ర్ నేత సోము వీర్రాజు విజ‌యవాడ‌లో మ‌రోసారి మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ నాయ‌కులకు పోల‌వ‌రం ప్రాజెక్ట్ పై ఎందుకంత ఆత్రుత చెందుతున్నార‌ని వీర్రాజు మండిప‌డ్డారు. 2014 ఎన్నికల్లో ముఖ్య‌మంత్రి అయిన చంద్ర‌బాబు నాయుడు అప్పుడు పోల‌వ‌రం ప్రాజెక్ట్ పనుల‌ను స్టార్ట్ చేసి ఉంటే ఈలోపు పూర్తిఅయి ఉండేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 
 
అలాగే పోల‌వ‌రం ప‌నుల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు శ్వేత‌ప‌త్రాన్ని విడుద‌ల చేయాల‌ని వీర్రాజు స్ప‌ష్టం చేశారు.గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు ప‌ట్టిసీమ‌కు ఇచ్చిన ప్రాధాన్య‌త‌ను పోల‌వ‌రానికి ఇచ్చి ఉంటే ప‌నులు పూర్తి అయ్యేవ‌ని ఆయ‌న తెలిపారు. గ‌తంలో ఈ విషయంపై నేను సూటిగా ప్ర‌శ్నించాన‌ని అయితే ఇంత వ‌ర‌కూ త‌న ప్ర‌శ్న‌కు చంద్ర‌బాబు నాయుడు స‌మాధానం ఇవ్వ‌లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 
 
పోల‌వ‌రం ప్రాజెక్ట్ ప‌నుల్లో 16 వేల కోట్ల ప‌నుల నుంచి 53 వేల కోట్లు ఎలా ఖ‌ర్చు చేశార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప‌నుల్లో టీడీపీ స‌ర్కార్ రోజుకొక లెక్క‌ల‌ను ఎందుకు మారుస్తున్నార‌ని వీర్రాజు నిల‌దీశారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి ఏ ప్రాజెక్ట్ ప‌ని అయినా ఉపాధి హామీ ప‌థ‌కంలా మారుతోంద‌ని ఇయ‌న విమ‌ర్శ‌లు చేశారు. చంద్ర‌బాబు దోపిడి చేయాలంటే గున‌పాలు స‌రిపోవ‌ని ప్రొక్ల‌యిన్లు కావాల‌ని మండిప‌డ్డారు. 
 
ఈ దోపిడీ విష‌యంలో చంద్ర‌బాబు నాయుడుకి ఆస్కార్ అవార్డ్ ఇవ్వాల‌ని సోము వీర్రాజు స్ప‌ష్టం చేశారు. గ‌తంలో ఎవ‌రైనా ప్ర‌త్యేక హోదా అని మాట ఎత్తితే  జైలుకు పంపుతామ‌ని చెప్పి ఇప్పుడు ఆయ‌న ప్ర‌త్యేక హోదా కావాలంటున్నార‌ని విమ‌ర్శ‌లు చేశారు. ఇక ఇప్పుడు టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ ఉక్కు ప‌రిశ్ర‌మ కావాల‌ని దీక్ష‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. అయితే ఈ దీక్ష‌కు ప్ర‌జ‌లు ఎవ్వ‌రు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంలేద‌ని, నాలుగు సంవ‌త్స‌రాలుగా వారు చేసే అవినీతి అక్రమాల‌ను ప్ర‌జ‌లు దృష్టిలో ఉంచుకున్నార‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి త‌గిన బుద్ది చెబుతార‌ని సోము వీర్రాజు స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.