టీడీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బీజేపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

nara chandrababu naidu and bjp image
Updated:  2018-03-12 11:01:57

టీడీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బీజేపీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు శ‌రవేగంగా మారుతున్నాయి.రాష్ట్రంలో ఉన్న టీడీపీ ప్ర‌భుత్వం ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌ను విస్మ‌రించి స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం పాల‌న చేస్తూ రాష్ట్ర అభివృద్దిని కేంద్రానికి తాక‌ట్టుపెడుతోంది అనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.. ఇటీవ‌ల కేంద్ర బ‌డ్జెట్‌లో ఏపీకి నిధులు కేటాయించ‌క పోవ‌డం నుంచి  ప్ర‌స్తుతం ప్ర‌త్యేక‌హోదా అంశం వ‌ర‌కూ, కేంద్రం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేయ‌డాన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని రాజ‌కీయ పార్టీలు తీవ్ర‌స్ధాయిలో విరుచుకుప‌డుతున్నారు. ఈ విష‌యంలో ప్ర‌తిప‌క్షాలు -ప్ర‌జ‌లు కేంద్రం పై పోరాటం చేస్తున్న విష‌యం అంద‌రికి తెలిసిందే.
 
అయితే ఎన్డీయే ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న టీడీపీ ఇటీవ‌ల కేంద్ర మంత్రి వ‌ర్గంలో ఉన్న త‌మ మంత్రుల‌ను సైతం రాజీనామా చేయించారు... మంత్రులు రాజీనామా చేసిన‌ప్ప‌టికి కూడా  ఎన్డీయే ప్ర‌భుత్వంలో కొన‌సాగుతామ‌ని టీడీపీ ప్ర‌క‌టించింది. అయితే ఎన్డీయేలో కొన‌సాగుతూనే వారి పై విమ‌ర్శ‌లు చేస్తోంది తెలుగుదేశం పార్టీ... దీని పై పార్టీ కేంద్ర పరిశీలకుడు సతీష్‌జీ నేతృత్వంలో  ఏపీ బీజేపీ కోర్ క‌మిటి విజయవాడలో స‌మావేశం ఏర్పాటు చేసింది. ఈ స‌మావేశంలో విమర్శలు చేస్తున్న‌ తెలుగుదేశం పార్టీపై బీజేపీ రాష్ట్ర నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్ర‌ప‌క్షం అంటూనే మిడ‌త‌ల దండులా త‌మ పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు అని విరుచుకుప‌డ్డారు..
 
మిత్ర ప‌క్ష‌మైన‌ టీడీపీ విధానం పై తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. ఒకవైపు టీడీపీ తీరును గమనిస్తూనే మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అందజేస్తున్న సహాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ శాఖ నిర్ణయించింది. విభజన చట్టంలోని 85 హామీలను నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడున్నర ఏళ్లలోనే నెరవేర్చిందని ఏపీ బీజేపీఅధ్య‌క్షుడు హరిబాబు తెలిపారు. ఇంత చేసిన బీజేపీని, టీడీపీ విమ‌ర్శించ‌డాన్ని ఏపీ బీజేపీ నాయ‌కులు తీవ్రంగా ఖండించారు... ఇక మ‌రో ప‌క్క ప్ర‌తీ గ్రామ గ్రామానా బీజేపీ ఏపీకి ఎటువంటి సాయం చేయ‌లేదు అనే వార్త‌ను విషయాన్ని క‌ర‌ప‌త్రాల రూపంలో అంద చేసి, ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాలి అని,  బీజేపీపై పోరాటం దిశ‌గా తెలుగుదేశం ఆలోచిస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.