వైయ‌స్ కు బీజేపీ ప్ర‌శంసలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-14 15:56:56

వైయ‌స్ కు బీజేపీ ప్ర‌శంసలు

నిజ‌మే క‌ల కాదు ఇది వాస్త‌వం...బీజేపీ ప‌క్కా కాంగ్రెస్ వాది అయిన వైయ‌స్సార్ పై ఫేవ‌ర్ గా మాట్లాడింది... అది ఏమీ పర్స‌న‌ల్ విష‌యంలో కాదు.. వైయ‌స్ కు బీజేపీ ప్ర‌శంస‌లు ఇవ్వ‌డానికి కార‌ణం కూడా లేక‌పోలేదు.. కాంగ్రెస్ హయాంలో వైయ‌స్ ప‌లు మం చి ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టార‌ని బీజేపీ నాయ‌కులు ప్ర‌శంస‌లు చేశారు. అస‌లు విష‌యంలోకి వెళితే.
 
పోల‌వ‌రం ప్రాజెక్ట్ నిర్మాణంలో ప‌నులు వేగ‌వంతం జ‌రిగింది కేవ‌లం వైయ‌స్ హ‌యాంలో అని  అన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధ‌వ్..కేంద్రం పోలవరం నిర్మిస్తామంటే.. కమీషన్ల కోసమే చంద్రబాబు ప్రాజెక్టు పనులు చేపట్టారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం పోలవరంలో ఏ పనులు పూర్తి చేయలేదన్నారు. అవినీతి అక్రమాలతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దోపిడీతో పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇసుక దొరకని దుస్థితి ఏర్పడిందన్నారు. 
 
ఆప‌రేష‌ణ్ గ‌రుడ ను  ఆయ‌న కొట్టిపారేశారు....అమిత్‌ షా, గడ్కరీలు త్వరలో ఏపీలో పర్యటిస్తారని,ఏపీలో బీజేపీ పుంజుకుంటుంద‌ని తెలియ‌చేశారు..కేంద్రం గృహాల నిర్మాణానికి నిధులిస్తుంటే బ్యాంకుల నుంచి రుణాలు ఎందుకు తీసుకోవాలన్నారు.. కేంద్రం నిధులు ఇచ్చింద‌ని వాటిని తెలుగుదేశం ఎక్క‌డ ఖ‌ర్చుపెట్టిందో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు ఆయ‌న‌... చంద్ర‌బాబు ఎప్పుడూ ఇటువంటి క‌బుర్లే చెబుతార‌ని, రైల్వేజోన్ 2003 లో రావాల‌ని, ఎర్ర‌న్నాయుడు రైల్వే బోర్డు చైర్మ‌న్ గా ఉన్న స‌మ‌యంలో రావాలి కాని రాలేద‌న్నారు... ఏపీలో జూలై నెల‌లోబీజేపీ నాయ‌కుల ప‌ర్య‌ట‌న ఉంటుంది అని తెలియ‌చేశారు ఆయ‌న‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.