వైసీపీలోకి బాబు స‌న్నిహితిడు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-26 16:47:14

వైసీపీలోకి బాబు స‌న్నిహితిడు

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్పయాత్ర‌ను మైలేజ్ పెంచుతూ ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర అవుతున్నారు.అధికారంలో ఉన్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాష్ట్రానికి చేసింది ఏమీ లేద‌ని, కేవ‌లం వారి స్వార్థ రాజ‌కీయాల కోసం రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని, పాద‌యాత్ర‌లో భాగంగా నిత్యం ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తూనే ఉన్నారు జగ‌న్. ఇక ఆయ‌న చెప్పిన మాట‌ల‌ను మొద‌ట్లో అలోచించ‌డానికి ప్ర‌జ‌ల‌కు కాస్త స‌మ‌యం ప‌ట్టింది.
 
అయితే కొద్దిరోజుల‌ క్రితం ప్ర‌త్యేక హోదా విష‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు యూట‌ర్న్ తీసుకోవ‌డంతో ప్రజ‌ల‌కు ఆయ‌నంటే ఏంటో పూర్తిగా తెలిసిపోయింది. ఇక రాష్ట్రంలో నిజ‌మైన నాయ‌కుడు ఎవ‌రైనా ఉన్నారంటే అది ఒక్క జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అని ప్ర‌జ‌లు కాల‌ర్ ఎగ‌రేసి మ‌రీ చెబుతున్నారు. ఇక ఈ నిజ‌మైన నాయ‌కుడికి 2019 ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా అధికార ప‌గ్గాల‌ను అప్ప‌గించేందుకు ప్ర‌జ‌లు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు జ‌గ‌న్ కు తెలుపున్న మ‌ద్ద‌తును చూసి టీడీపీ నాయ‌కులు కొద్ది కాలంగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ స‌మ‌యం చూసుకుని పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు రెడీ అవుతున్నారు.ఇక‌ప్ప‌టికే టీడీపీ నుంచి అనేక మంది సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ ఎమ్మెల్యేలు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.
 
ఇక తాజాగా బొబ్బిలి మాజీ టీడీపీ ఎమ్మెల్యే శంబంగి అప్ప‌లనాయుడు, బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల‌ను చూసి తాను వైసీపీలో చేరాన‌ని అన్నారు. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపుకోసం త‌న వంతు కృషి చేస్తాన‌ని అప్ప‌ల‌నాయుడు తెలిపారు .అలాగే చంద్రబాబు ప‌రిపాల‌న‌లో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ‌ లేకుండా పోయింద‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్రం బాగుప‌డాలంటే క‌చ్చితంగా జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల‌ని అప్ప‌ల‌నాయుడు అన్నారు.
 
ఈయ‌న బొబ్బిలి నియోజకవర్గానికి 1983,1985,1994 సంవత్సరాలలో టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు.ఆ త‌ర్వాత 1994 లో టీడీపీ విప్ గా పనిచేశారు. అప్ప‌ల‌నాయుడు ఎక్కువ సంవ‌త్స‌రాలు టీడీపీలోనే కాలం గ‌డిపారు. ఆ త‌ర్వాత 2014లో కాంగ్రెస్ తరపున పోటీచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఏఐసీసీ మెంబర్‌గా కొనసాగుతున్నారు. ఇక రానున్న రోజుల్లో ఏపీలో కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రావ‌ని తెలిసి తిరిగి మ‌ళ్లీ 2019 ఎన్నిక‌ల్లో టీడీపీలోకి చేరుతార‌ని చంద్ర‌బాబు ఎంతో ఆశ‌గా చూశార‌ట‌. కానీ ఊహించ‌ని ప‌రిణామంలో ఆయ‌న వైసీపీలో చేరారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.