వైసీపీకి జై కొట్టిన చంద్ర‌బాబు స‌న్నిహితుడు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan padayatra west godavari
Updated:  2018-05-16 04:10:30

వైసీపీకి జై కొట్టిన చంద్ర‌బాబు స‌న్నిహితుడు

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏ ముహూర్తాన‌ ప్ర‌జాసంక‌ల్పయాత్ర మొద‌లు పెట్టారో కానీ, ప్ర‌స్తుతం క‌నీవినీ ఎరుగ‌ని రీతితో వైసీపీలోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి.2014 సార్వ‌త్రిక‌ ఎన్నికల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున అత్య‌ధిక మెజారిటీతో గెలిచి అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగ‌తి తెలిసందే. 
 
ఇక తాజాగా వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌లు తెలుపుతున్న మ‌ద్ద‌తును చూసి 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని భావించి, టీడీపీ నాయ‌కులు త‌మ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌టికే టీడీపీ కంచుకోట‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న కృష్ణా జిల్లాలో కూడా టీడీపీ నాయ‌కులు వైసీపీలోకి చేరారు. 
 
రాజ‌కీయ సీనియ‌ర్ నాయ‌కులు య‌ల‌మంచిలి ర‌వి, అలాగే ప్ర‌ముఖ్య పారిశ్రామికవేత్త కృష్ణప్రసాద్‌, తన తండ్రి, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావుతో కలిసి ఈ నెల 10న జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇక తాజాగా జ‌గ‌న్  పశ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌కవ‌ర్గంలో పాద‌యాత్ర చేప‌డుతుండ‌డంతో అక్క‌డ‌ కూడా టీడీపీ నుంచి వైసీపీలోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి.
 
ఈ క్ర‌మంలో రెండున్నర దశాబ్ధాల పాటు చంద్ర బాబుకు అత్యంత సన్నిహిత నాయకుడిగా ఉన్న టీడీపీ నాయకుడు జగన్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నార‌ని తెలుస్తోంది. ఇందు కోసం పార్టీ కార్య‌క‌ర్త‌లు ఏర్పాట్లను కూడా సిద్దం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్త‌ను విన్న టీడీపీ నాయ‌కుల్లో ప్ర‌కంప‌న‌లు స్టార్ట్ అయ్యాయి.
 
పశ్ఛిమ గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన  సీనియర్ టీడీపీ  నాయకుడు బొడ్డు భాస్కర రామారావు ప్ర‌స్తుతం టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యార‌ని విశ్లేష‌కులు తెలుపుతున్నారు. అయితే ఆయ‌న పార్టీ మార‌డానికి ముఖ్య కార‌ణం మొన్న హోం మంత్రి చినరాజ‌ప్ప ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్లో  ఏక‌వ‌చ‌నంతో  మాట్లాడిన మాట‌లే అని తెలుస్తోంది. అలాగే తాను పెద్దాపురం నుంచి 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని చిన‌రాజ‌ప్ప చెప్పారు. ఇక ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌న్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న బొడ్డు భాస్కర రామారావు చిన‌రాజ‌ప్ప‌పై ఆగ్ర‌హంతో ఉన్నారు. 
 
ఈ క్ర‌మంలో బొడ్డు భాస్క‌ర రామారావు, హోమంత్రిని విమ‌ర్శిస్తూ ఒక లేఖ కూడా రాసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇంత జ‌రుగుతున్నా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మాత్రం హోం మంత్రిపై  ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకుండా మెనేజ్ చేస్తూ వ‌చ్చారు. ఇక రెండున్న‌ర ద‌శాబ్దాలుగా  చంద్రబాబు రాజకీయ డ్రామాలు ఎలా ఉంటాయో బాగా అవగాహన ఉన్న బొడ్డు భాస్కర రామారావు తాజాగా తన సన్నిహితులతో సమావేశం ఏర్పాటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ స‌మావేశంలో చంద్రబాబు రాజకీయాలను అస్సలు నమ్మలేమని, అందుకోస‌మే వైసీపీలోకి వెళ్ళడమే మంచిదని ఆయన సన్నిహితులతో చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.