వైసీపీలో చేరిన బొల్లినేని

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-08 11:32:02

వైసీపీలో చేరిన బొల్లినేని

క‌డ‌ప జిల్లాలో బద్వేలు రాజ‌కీయం, జ‌మ్మ‌లమ‌డుగులో పొలిటిక‌ల్ వార్ ఇరువ‌ర్గాల మ‌ధ్య స‌రికొత్త మ‌లుపులు తిప్పుతోంది... మొత్తం ఆధిప‌త్య పోరుచుట్టూనే ఇక్క‌డ రాజ‌కీయం జ‌రుగుతోంది.. అయితే వ‌ర్గ‌పోరు వ‌ద్దు అని చెబుతున్నా సీఎం చంద్ర‌బాబు మాట లెక్క‌చేయ‌డం లేదు ఇక్క‌డ పార్టీ నాయ‌కులు... అయితే ఇటు మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి కూడా తెలుగుదేశం త‌ర‌పున వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కే టికెట్ ఇస్తారు అని రామ‌సుబ్బారెడ్డికి ఓ చుర‌క అంటించారు... ఆ నిప్పు పెద్ద సెగ‌లా త‌గిలింది జ‌మ్మ‌ల‌మ‌డుగు రాజ‌కీయాల్లో.
 
అయితే ఇప్పుడు వైఎస్సార్‌ జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జునరెడ్డి పై గుర్రుగా ఉన్న ఓ నాయ‌కుడు  ఏకంగా పార్టీకి గుడ్ బై చెప్పారు..ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జునరెడ్డి పార్టీని సర్వనాశనం చేస్తున్నాడని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బొల్లినేని రామ్మోహన్‌నాయుడు ఫైర్ అయ్యారు..ఎమ్మెల్యే తీరుకు నిరసనగా తన పదవికీ, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.... పార్టీలో జరుగుతున్న అవమానాలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. దీంతో పార్టీలో కాస్త అల‌జ‌డి వ‌చ్చింది.
 
అనూహ్యాంగా ఆయ‌న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌ రెడ్డి, సీనియర్‌ నాయకుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి సమక్షంలో బొల్లినేని పార్టీలో చేరారు. రాజంపేట ఎమ్మెల్యేగా మల్లికార్జునరెడ్డి గెలవడానికి ఇక్క‌డ కమ్మ సామాజిక వర్గం ఎంతో కృషి చేసిందని, అయితే ఆయన నాలుగేళ్లుగా కమ్మ వర్గీయులను పూర్తిగా అణగదొక్కారని విమర్శించారు.
 
అధికారుల నుంచి పనులు చేయించుకునేందుకు ఎమ్మెల్యే వర్గీయులు చేస్తున్న వ్యవహారాలు నియోజకవర్గంలో అందరికీ తెలిసిందేనన్నారు. ఎమ్మెల్యే పేరుతో కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, అలాగే భూదందా, కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజంపేట తహసీల్దారు నివసిస్తున్న అపార్టుమెంట్‌ అద్దె కూడా ఎమ్మెల్యే వర్గీయుల్లో కొందరు చెల్లిస్తున్నారంటే ఇక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.