హైకోర్టుకు బోండా భార్య

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-22 12:06:15

హైకోర్టుకు బోండా భార్య

తెలుగుదేశం పార్టీ విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బోండా ఉమా మ‌హేశ్వ‌ర్ రావు కుటుంబం ఓ స్వాతంత్య్ర‌  స‌మ‌ర‌యోధుడి స్ధ‌లం భూక‌బ్జాకు గురైన   వివాదంలో చిక్కుకున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.  ఈ వ్య‌వ‌హారంలో త‌న‌పై న‌మోదైన కేసుల‌ను కొట్టేయాలంటూ బోండా ఉమా స‌తీమ‌ణి సుజాత హైకోర్టును ఆశ్ర‌యించారు. 
 
సుజాత పిటీష‌న్ పై విచార‌న చేప‌ట్టిన హైకోర్టు 8 వారాల పాటు స్టే విధించింది. ఈ గ‌డువులోపు కౌంట‌ర్ దాఖ‌లు చేయాలంటూ సీఐడీ అధికారుల‌ను హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ భూక‌బ్జా కేసులో బోండా సుజాత ఏ-8 ముద్దాయిగా ఉన్నారు. 
 
సూర్య‌నారాయ‌ణ  అనే స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడికి ప్ర‌భుత్వం 1951లో  10 ఎక‌రాల భూమిని కేటాయించింది. అయితే 2016లో ఈ భూమికి సంబంధించి న‌కిలీ ప‌త్రాల‌ను సృష్టించి బోండా ఉమా ఫ్యామిలీ కబ్జాకు పాల్ప‌డింద‌నే ఆరోప‌ణ తెర‌పైకి వ‌చ్చింది. స‌ద‌రు బాధితులు సీఐడీని ఆశ్ర‌యించ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.