మ‌రో వివాదంలో బోండా ఉమ‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

bonda uma
Updated:  2018-02-24 03:49:17

మ‌రో వివాదంలో బోండా ఉమ‌

తెలుగుదేశం నాయ‌కుల‌పై భూ వివాదాలు రోజు రోజుకు ఏదో ఓ మూల వెలుగులోకి వ‌స్తున్నాయి.. కొంద‌రు సైలెంట్ గా తెర‌వెనుక  రాజ‌కీయాలు నెర‌పుతుంటే, మ‌రి కొన్ని అస‌లు వెలుగులోకి రాకుండా పోతున్నాయి.. తాజాగా తెలుగుదేశం నేత‌ల‌పై విశాఖ భూ క‌బ్జాల నుంచి, ఎమ్మెల్యే బోండా ఉమ భూ వివాదం వ‌ర‌కూ అనేక విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి.
 
తెలుగుదేశం ఎమ్మెల్యేల అక్ర‌మాల‌పై వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు అనేక విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు.ఇక విజ‌య‌వాడ‌లో స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడి భూమిని క‌బ్జా చేసిన‌ విష‌యంలో,ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే బోండా ఉమ మ‌రో వివాదంలో చిక్కుకున్నారు.
 
పెనమలూరు డెవెలప్‌మెంట్‌ పేరుతో తన 86 సెంట్ల భూమిని ఆక్రమించారని ఇద్దరు మహిళలు జాయింట్‌  కలెక్టర్‌ను ఆశ్రయించారు. అభివృద్ధి పేరుతో తమ భూమిని కాజేయాలని ఎమ్మెల్యే బోండా ప్రయ‌త్నిస్తున్నారని పెనమలూరుకు చెందిన ఉమాదేవి, లక్ష్మీ భవాని జాయింట్‌ కలెక్టర్‌నకు ఫిర్యాదు చేశారు. ఈఫిర్యాదు జేసికి నేరుగా వెళ్ల‌డంతో ఇప్పుడు ఇదే అంశం పై విజ‌య‌వాడ‌లో జ‌నం చ‌ర్చించుకుంటున్నారు.
 
త‌మ భూమిని వారికి  అప్పగించకపోతే చంపేస్తామంటూ బోండా ఉమ అనుచరులు పోలవరపు కిషన్‌, వెంకట నరసయ్య బెదిరిస్తున్నారంటూ  వారు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు.. గత మూడేళ్లలో వారి భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదని, పోనీ తమ భూములను అప్పగించమని కోరితే బెదిరింపులకు పాల్పడుతున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. త‌మ స్ద‌లంలో వారి మ‌నుషులు పెత్త‌నం చెలాయిస్తున్నారు అని విమ‌ర్శించారు.
 
తమకు తెలియకుండానే తమ భూమిని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి అప్పు తెచ్చామంటున్నారని, వాటికి వడ్డీ కట్టాలంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను కలిసి తమ బాధలను చెప్పుకొని న్యాయం చేయ‌మ‌ని కోరితే ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతున్నారని వాపోయారు... ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలంటూ అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నారని కంటతడిపెట్టుకున్నారు. నిజంగా దీనిపై విజ‌యవాడలో ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.. త‌మ ఓట్ల‌తో గెలిచి త‌మ‌పై పెత్త‌నం చెలాయించే ఇలాంటి నాయ‌కుల‌కు వచ్చే ఎన్నిక‌ల్లో త‌గిన గుణ‌పాఠం చెబుతామ‌ని అంటున్నారు ప్ర‌జ‌లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.