పాలిటిక్స్ కి గుడ్ బై....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-26 01:07:30

పాలిటిక్స్ కి గుడ్ బై....

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర రావు కుటుంబంపై గ‌త కొన్ని రోజులుగా ప‌లు వార్త‌లు తెర‌పైకి వ‌స్తూనే ఉన్నాయి. ఓ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడికి సంబంధించిన భూమిని క‌బ్జా చేశార‌నే ఆరోప‌ణ‌ల‌తో పాటు బోండా ఉమా స‌తీమ‌ణిపై  కేసు కూడా న‌మోదైన విష‌యం అంద‌రికీ తెలిసిందే. 
 
పెద్ద ఎత్తున వ‌స్తున్న ఆరోప‌ణ‌లను ఖండించారు బోండా ఉమా. నేను, నా కుటుంబ సభ్యులు భూ కబ్జాలకు పాల్పడినట్టు నిరూపిస్తే, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ స‌వాల్ విసిరారు. అంతేకాదు,  నేను కానీ, నా అనుచరులు కానీ తప్పు చేశారని మీకు అనిపిస్తే.. చట్ట ప్రకారం వెళ్లండి కాని, ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయొద్ద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 
 
భూ కబ్జా ఆరోపణలపై ఎవరు వచ్చినా... బహిరంగ చర్చకు నేను సిద్ధమ‌ని, త‌మ‌కు భూ క‌బ్జాకు సంబంధించిన వ్య‌వ‌హారంతో ఎలాంటి సంబంధం లేద‌ని, అన‌వ‌స‌రంగా త‌మ  కుటుంబ‌స‌భ్యుల‌పై బుర‌ద జ‌ల్ల‌డం మానుకోవాల‌ని బోండా ఫైర్ అయ్యారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.