బొత్స, వైవీ, విజ‌యాసాయి రెడ్డి చెన్నైకి ప్ర‌యాణం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

botsa sathya narayana and yv subba reddy and vijaya sai reddy
Updated:  2018-08-06 06:09:34

బొత్స, వైవీ, విజ‌యాసాయి రెడ్డి చెన్నైకి ప్ర‌యాణం

ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, అలాగే జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి విజ‌య‌సాయి రెడ్డిలు ఈ రోజు చెన్నైకి బ‌య‌ల్దెరనున్నారు. గ‌త కొద్ది కాలంగా మాజీ ముఖ్య‌మంత్రి డీఎంకే అధ్య‌క్షుడు క‌రుణానిధి అనారోగ్యంతో కావేరీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందు ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వీరిని ఈరోజు సాయంత్రం చెన్నైకి వెళ్ల‌మ‌ని సూచించారు.
 
పార్టీ అధినేత కోరిక మేర‌కు ఈ రోజు వీరు చెన్నైకి బ‌య‌ల్దేరి అక్క‌డి నుంచి అటే క‌రుణానిధి చికిత్స పొందుతున్న ఆసుప‌త్రికి చేరుకుని ఆయ‌న ఆరోగ్యం గురించి జ‌గ‌న్ కు ఫోన్ లో వివ‌రించ‌నున్నారు. వాస్త‌వాని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డినే ప్ర‌త్యేకంగా వెళ్లి క‌రుణానిధి ఆరోగ్యంపై ప‌రామ‌ర్శించాల్సి ఉంది. కానీ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర చేస్తున్న త‌రుణంలో ఆయ‌న వెళ్ల‌డానికి వీల‌ప‌డ‌దు క‌నుక త‌న బ‌దులు పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు వైవీ సుబ్బారెడ్డి, బొత్స స‌త్య‌నారాయ‌ణ, విజ‌య‌సాయి రెడ్డిల‌ను పంపించ‌నున్నారు. వృద్దాప్యంలో ఉన్న క‌రుణానిధి స‌త‌మ‌త‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఆయ‌న ఆరోగ్యం పూర్తిగా క్షిణించ‌డంతో ఈ నెల 28వ తేదిన ఆయ‌న‌ను కావేరీ ఆసుప‌త్రిలో అడ్మిట్ చేసిన సంగ‌తి తెలిసిందే. 
 
కాగా క‌రుణానిధి తమిళనాడు రాష్ట్రానికి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 60 సంవత్సరాల త‌న రాజకీయ జీవితంలో పోటీ చేసిన ప్రతీ ఎన్నికల్లో గెలిచి రికార్డు సృష్టించారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.