బాబు కొత్త ర‌హ‌స్యాన్ని బ‌య‌ట‌పెట్టిన బొత్స‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-19 12:38:32

బాబు కొత్త ర‌హ‌స్యాన్ని బ‌య‌ట‌పెట్టిన బొత్స‌

ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మ‌రోసారి ఏపీ ముఖ్యంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుపై పలు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు... అధికార బ‌లంతో చంద్ర‌బాబు అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని, వాటిని త్వ‌ర‌లోనే సాక్షాల‌తో స‌హా మీడియా ద్వారా వివ‌రిస్తాన‌ని తెలిపారు... 2016 న‌వంబ‌ర్ ఎనిమిద‌వ తేదిన ప్ర‌ధాన‌మంత్రి న‌ల్ల‌కుభేరుల భ‌ర‌తం ప‌ట్టేందుకు ఐదు వంద‌ల నోట్లు, వెయ్యి రూపాయ‌ల‌ నోట్లను ర‌ద్దు చేయించార‌ని, ఆ స‌మ‌యంలో చంద్ర‌బాబు అక్ర‌మంగా త‌న డ‌బ్బును మార్చుకున్నార‌ని మండిప‌డ్డారు... ఈ డిమోనిటైజెషన్ వ‌ల్ల  న‌ల్ల‌కుభేరులు, చంద్ర‌బాబు బాగుప‌డ్డారు త‌ప్ప సాధార‌ణ ప్ర‌జ‌లు అనేక అవస్థలు ప‌డ్డార‌ని తెలిపారు.
 
డిమోనిటైజెషన్ జ‌రిగిన త‌ర్వాత న‌ల్ల‌కుభేరులు ఒక్క‌రైనా ఏటీఎం వద్ద నిల‌బ‌డి డ‌బ్బుల‌ను డ్రా చేసుకున్నారా అని ప్ర‌శ్నించారు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌... సామాన్యుడు బ్యాంక్ వ‌ద్ద‌ లైన్లో ఉండి డ‌బ్బులను మార్పు చేసుకున్న‌ దానింటే చంద్ర‌బాబు నాయుడు ద‌గ్గ‌రే కొత్త నోట్లు అధికంగా ఉన్నాయ‌ని గుర్తు చేశారు బొత్స‌... వారు  లైన్లో నిల‌బ‌డ‌కుండా  అంత‌ డ‌బ్బును ఎలా మార్చ‌గ‌లిగార‌నే ప్ర‌శ్నకు ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌నాల‌కు స‌మాధానం దొర‌క‌లేదని బొత్స అన్నారు.
 
ఈ డిమోనిటైజెషన్ లో భాగంగా త‌మిళ‌నాడు టీటీడీ పాల‌క మండ‌ల స‌భ్య‌డు శేఖ‌ర్ రెడ్డి ఇళ్ల‌పై దాడులు నిర్వ‌హించిన ఐటీ అధికారులుకు  70 కోట్లు విలువచేసే కొత్త 2వేలు దొరకడంతో అందరు షాక్ కు గురి చేసిన సంగ‌తి తెలిసిందే.. అయితే ఈ వ్య‌వ‌హారంలో శేఖ‌ర్ రెడ్డికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి సంబంధం ఉంద‌ని బొత్స‌ ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. డిమోనిటైజెషన్  స‌మ‌యంలో చంద్రబాబు, శేఖర్ రెడ్డి ద్వారా 500 కోట్ల రూపాయల బ్లాక్ మనీని మార్చుకున్నారని ఈ విషయం శేఖర్ రెడ్డి స్వయంగా సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలిపారు బొత్స.... సీబీఐ నివేదిక బయటపడితే బాబు బండారం బయటపడుతుందని చెప్పారు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.