బొత్స స‌రికొత్త ప్లాన్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-27 03:40:03

బొత్స స‌రికొత్త ప్లాన్ ?

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైయ‌స్  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్పయాత్ర‌కు అడుగడుగునా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు... ఈ సంక‌ల్ప యాత్ర క‌డ‌ప జిల్లా ఇడుపులపాయలో మొద‌లుకుని నిర్విరామంగా నేడు ప్ర‌కాశం జిల్లా మార్కాపురంలోని క‌టురివారిపాలెంలో కొన‌సాగుతోంది...ఇక ఇప్ప‌టికే జ‌గ‌న్ సంక‌ల్ప యాత్ర‌ 1000 కిలోమీట‌ర్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంలో  రాష్ట‌వ్యాప్తంగా వైయ‌స్సార్ కాంగ్రెస్ నాయ‌కులు !!వాక్ విత్ జ‌గ‌న్!! పేరుతో పాద‌యాత్ర చేస్తున్నారు.
 
అయితే ఇటీవ‌లే మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ  త‌న నియోజ‌క‌వ‌ర్గం చీపురుప‌ల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేసేందుకు నిర్ణ‌యించుకున్నారు... ఇందుకోసం బొత్స త‌గిన ఏర్పాట్ల‌ను సిద్దం చేస్తున్నారు.. 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌రపున పోటీ చేసి ప‌రాజ‌యం ఎదుర్కొన్న ఆయ‌న, వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రపున పోటీ చేసి ఎలాగైనా గెల‌వాల‌నే గ‌ట్టి ధీమాతో బొత్స త‌న సెగ్మెంట్ లో ప‌ర్య‌టిస్తున్నారు.
 
దీంతో పాటు గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు మ‌ద్ద‌తు ఇచ్చే ప‌లు ప్రాంతాల నాయ‌కులు కూడా ఇత‌ర పార్టీల‌కు వెళ్లి పోయిన సంగ‌తి తెలిసిందే...అయితే ఈ నేప‌థ్యంలో వారిని ఎలాగైనా తిరిగి త‌న‌వైపు తిప్పుకునేందుకు ప‌క్కాగా స్కెచ్ లు వేస్తున్నారు బొత్స‌... అయితే ఈ స్కెచ్   కొంత మేర‌ స‌క్సెస్ కావ‌డంతో త‌న‌ను కాద‌ని వెళ్లి పోయిన నాయ‌కులు మ‌ళ్లీ త‌న గూటికి వ‌చ్చేలా చేస్తున్నారు బొత్స‌... దీంతో పాటు జిల్లా స్థాయి నేత‌లు కూడా ఆయ‌న‌కు ద‌గ్గ‌ర అవుతున్నారు.
 
రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మ‌న‌దే విజ‌యం అంటూ, కార్య‌క‌ర్త‌లు దైర్యంగా ఉండాల‌ని, ఎన్నిక‌లకు  స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంద‌ని ప్ర‌తీ ఒక్క‌రు అదైర్యప‌డ‌కుండా శ్రమించాల‌ని బొత్స వారికి సూచిస్తున్నారు.. అందులో భాగంగానే త‌న సెగ్మెంట్ లో రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న‌వారిని త‌న వైపు తిప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు.
 
దీంతో పాటు త‌న మేన‌ల్లుడు వైసీపీ జిల్లా స‌మ‌న్వ‌య‌క‌ర్త మ‌జ్జి శ్రీనివాస్ రావు  కూడా తెర వెనుక  జ‌రిగే రాజ‌కీయాల‌పై క‌న్నేసి ఇత‌ర కార్యక‌ర్త‌ల‌ను త‌న మామ‌య్య బొత్స స‌త్య‌నారాయ‌ణ గూటికి చేర్చే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. ఇక‌, టీడీపీలో అసంతృప్తులుగా ఉన్న వారిని కూడా పార్టీలో చేర్చుకునేందుకు పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు  ప్రారంభించారు ఆయ‌న‌.. ఎవ‌రెవ‌రు పార్టీలోకి వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్నారో వారిని తెలుసుకునే ప‌నిలో ఉన్నారు శ్రీనివాస్... వారికి అవ‌స‌ర‌మైతే ప‌ద‌వుల‌ను సైతం క‌ట్ట‌బెట్టేందుకు రెడీ అవుతున్నార‌ని, దీనిపై త్వ‌ర‌లోనే ఆయ‌న జ‌గ‌న్‌తో చ‌ర్చించ‌నున్నార‌ని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.